టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కి పిచ్చి పట్టిందా

23 May 2016


కొంతమంది నేతలు నోరు పారేసుకుని అడ్డంగా వాగుతూ చివరికి తమ పార్టీకే చికాకుగా మారుతుంటారు..ఏదో అడ్డంగా మాట్లాడుతుంటారు కదాని అధికారప్రతినిధి హోదా కట్టబెడితే..ఇక ఏం మాట్లాడినా చెల్లుతుందనే భ్రమలో ఉంటారు..ఈ వరసలో జనం టీవీలు బద్దలు కొట్టేంత అసహ్యం పెంచుకుంటున్నారనే నిజం కూడా గ్రహించరు. ఆదివారం టివీ 5 చర్చలో ఏపికి ప్రత్యేక హోదా, నిధులు పై జరుగుతున్న అన్యాయం పై మాజీ మంత్రి పార్ధసారధి, బిజెపినేతలతో పాటు, టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్ధసారధి " మేం పార్లమెంట్ లో పోరాడుతున్నాం. అలానే స్టేట్ లో కూడా ఆందోళన చేస్తున్నాం..మాపై నమ్మకం లేకనే..టిడిపి బిజెపి ఏదో ఒరగబెడుతుందని మిమ్మల్ని గెలిపించారు..కానీ మీరు మమ్మల్ని పోరాడండి అని చెప్పడం ఏంటి" అని ప్రశ్నించారు..దానికి సరైనోడైతే..ఇంకో సమాధానం చెప్తారు..కానీ అక్కడుంది రాజేంద్రప్రసాద్ కదా..అందుకే ..ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ..అసలు మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు..మోడీ ని ఎందుకు నిలదీయడంటూ సోది మాటలు వాడారు..ఇంత అజ్ఞానంగా మాట్లాడటంలో టిడిపినేతలకు పోటీ పెడితే..అది ఆయనకే అగ్రస్థానం వస్తుందని చెప్పకతప్పదు. అన్నీ తెస్తామని చెప్పింది టిడిపి బిజెపినేతలే..ఇప్పుడు అధికారంలో ఉన్నదీ వాళ్లే..అలాంటిది ఏపికి అన్యాయం జరుగుతుందని అడగరు..అడిగేవాళ్లపై రాళ్లదాడులు..ఛీ ఛీ ఇదేం తీరని జనం అసహ్యించుకుంటున్నా ఈ నేతలకు అస్సలు సిగ్గు లేదు.

Yesterday in a TV live show about AP Special status some TDP, BJP and YSRCP leaders were attended. But in this show MLC Rajendra Prasad comments are giving shock to all viewers.