ఆమెనెప్పుడూ బిజీగా ఉంచాలట

27 May 2016


హిట్లున్నా, ఆఫర్లు లేని బ్యూటీ లావణ్య త్రిపాఠి. అటు యూత్ ఫుల్ గా, ఇటు సీనియర్ హీరోలకు సరిజోడుగా కన్పించే అందమున్న లావణ్య ఇప్పుడు తనకెంతో వయస్సు మీద పడినట్లు మాట్లాడుతోంది. పెళ్లి వయసు వచ్చేసినట్లే ఫీలౌతుంది. ఐతే అది మాత్రం తన నిర్ణయానిదే ఫైనల్ అని, తన పర్సనల్ మేటర్స్ లో ఎవర్నీ కేర్ చేయనంటోంది. వరసగా సినిమాలు చేయకపోవడంపై కూడా పెద్దగా ఫీలవదట లావణ్య. నాకేది నచ్చితే అదే చేస్తానంటున్న ఈ కర్లింగ్ హెయిర్ బ్యూటీ .పెళ్లి కూడా తన ఇష్టం ప్రకారమే చేసుకుంటుందట. 

అంతే కాదు వచ్చేవాడు తనని బోలెడంత బిజీగా ఉంచాలట, ఇంకెవ్వరికీ మాట్లాడటానికి కూడా టైమ్ ఇవ్వనంత ఎంజాయ్ చేస్తానని చెప్తోంది. ప్రతి క్షణం సర్ ప్రైజులివ్వడమంటే అదంత తేలికైన పని కాదు..అందులో హీరోయిన్లుగా చేసి తర్వాత హోమ్లీగా సెటిలవ్వాలంటే తొందరగా సెట్ అవ్వదు. అందుకే లావణ్య త్రిపాఠీ కోరికలపై ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నవ్వుకుంటున్నాయ్.

 Tollywood hot beauty Lavanya Tripati got more popularity with Soggade Chinni Nayana. She is getting more movies. Now she is thinking about her marriage. I want keep her husband, her as very busy.