నీళ్లు కావాలి బాబోయ్

3 May 2016


మంచినీళ్లు లేదు..ఉప్పునీళ్లు లేదు. ఏ నీళ్లైనా పర్లేదు, అసలు మురికి నీటిని కూడా వదలకుండా వాడేస్తున్నారు దేశమంతా ఇప్పుడు. అంత ఎద్దడి ఉంది ప్రస్తుతం. భవిష్యత్ ని ఊహించకుండా, ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా వాడేసుకుంటూ నీరు లేకుండా బోర్లన్నీ ఇంకిపోయేట్లు చేసుకుంది మనమే. ఐతే ఇప్పటికైనా కళ్లు తెరిస్తే, ఎవడి ఇంటి ముందు వాడు జలరక్షణ చర్యలు చేపడితే ఇక భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు ఉండవ్. ఐతే ఇంత ఎద్దడిలోనూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ (ఇంకే రాష్ట్రాల సంగతి పక్కనబెడదాం) ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులకు ఎంతెంత నీరు అవసరమవుతుందో తెలుసా, మైండ్ బ్లాక్ కాకతప్పదు. 

ఒక్క మార్చి నెలలో నాలుగు లక్షల 85వేల లీటర్ల నీరు వాడారట. ఇది హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు లెక్కలే చెప్తుంది. అదే ఫ్రిబ్రవరిలో 2 లక్షల 12వేల లీటర్లు, జనవరిలో 2 లక్షల 29 వేల లీటర్లు కేసీఆర్ వాడారట. ఇది ఆయన ఒక్క కుటుంబమని చెప్పడం లేదు. క్యాంప్ ఆఫీస్ కి అవుతున్న ఖర్చు, ఐతే మరి డబ్బు మాత్రం కట్టడం లేదట. ఇదెంత ఉందో తెలుసా కేవలం 65 వేల 962 రూపాయలు మాత్రమే. అలానే గవర్నర్ ఉండే రాజ్ భవన్ తక్కువ తిన్నదా దానికి నెలకి 14 లక్షల రెండువేల లీటర్లు నెలకు వాడుకుంటోందట.

గత రెండు నెలలుగా ఇక్కడ ఖర్చు మరో నాలుగు లక్షల లీటర్లు పెరిగిందట. ఫిబ్రవరిలో 10 లక్షల 55 వేల లీటర్లు, మార్చిలో 20 లక్షల 29 వేల లీటర్లు నీరు వాడేసుకున్నారట. రాజ్ భవన్ నివాసితులంతా, బిల్ బకాయి లక్షా పద్నాలుగు వేలు. ఇక అసెంబ్లీకి 70లక్షల లీటర్లు నెలకు అవుతుండగా, మార్చిలో 71 లక్షల 47 వేలు, ఫిబ్రవరిలో 83లక్షల 36వేల లీటర్లు ఖర్చయ్యాయట. అక్కడెక్కడో మహారాష్ట్రలోని లాతూరుకి రైల్లో తరలిస్తుంది 5లక్షల లీటర్లు, అది ఓ గ్రామానికి రెండు మూడు రోజుల పాటు వస్తాయట. అలాంటిది మనకి ఇక్కడ లక్షలకి లక్షల లీటర్ల నీరు ఖర్చవడం భరించవచ్చా చెప్పండి...

In this summer temperatures are increasing daily. Use of water is increasing highly. In Hyderabad lacks of liters water is used every day. Only Government offices are using lacks of water for every month.