లెఫ్టే రైట్

20 May 2016


కేరళలో ఎల్ డీఎఫ్ కూటమి విజయం సాధించింది. 80 పైచిలుకు స్థానాల్లో విజయదుందుబి మోగించింది. అధికార యుఢిఎఫ్ కూటమి 50 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. కేరళలో బీజేపీ ఖాతా తెరిచి 1 సీటు దక్కించుకోగా, ఇతరులు మరో స్థానంలో విజయం సాధించారు. కేరళలో యూడిఎఫ్ ఓటమిపాలవగా, లెఫ్ట్ ఫ్రంట్ అధికారపగ్గాలు చేపట్టబోతోంది.  సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు సంపూర్ణ మెజార్టీ కట్టెబెట్టారు. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో 80 పైచిలుకు స్థానాల్లో ఎల్ డీ ఎఫ్ విజయం సాధించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ విజయం సాధించడంతో ఆ పార్టీల కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మాజీ సిఎం అచ్చుతానందన్, సిపిఎం సీనియర్ నేత పినరాయ్ విజయన్ తమలో విబేధాలు పక్కనబెట్టి చేసిన ప్రచారం విజయవంతం కావడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే అంశం చర్చకు వస్తోంది. ఈ ఎన్నికల కన్నా ముందే జరిగిన పంచాయితీ ఎలక్షన్లలోనే ట్రెండ్ మారుతున్న విషయం పసిగట్టిన వామపక్షాలు ప్రభుత్వ వ్యతిరేకతను బాగా సొమ్ము చేసుకోగలిగారు. పంచాయతీ ఎన్నికల్లో ఎల్ డీ ఎఫ్ కూటమి 57 శాతం సీట్లు సాధిస్తే, అధికార యుడీఎఫ్‌ కూటమి కేవలం 42 స్థానాలు గెలుచుకోగలిగింది.

ఇక ఇప్పటిదాకా అధికారపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు భాగస్వామపక్షాలతో పోటీ కలిసి రాలేదు..అసెంబ్లీ ఎన్నికలకు ముందు బైటపడిన సోలార్ స్కామ్..దళిత యువతిపై అత్యాచారం వంటి అంశాలు సిఎం ఊమెన్ చాందీతో పాటు..కాంగ్రెస్ ఇమేజ్ ని తీవ్రంగా దెబ్బతీశాయ్. అందుకే మంత్రుల్లో చాలామంది పరాజయం పాలయ్యారు..ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు..గా ప్రతిసారీ తమ తీర్పును మార్చే సంప్రదాయాన్ని కేరళ ఓటర్లు మరోసారి పాటించినట్లు ఈ ఎన్నికలు రుజువు చేశాయ్.

స్పాట్ వాయిస్: ఇక జాతీయపార్టీ బిజెపికి కేరళ ఓటర్లు చుక్కలు చూపించారనే చెప్పాలి..మొత్తం సీట్లకు దాదాపుగా ఒంటరిగా బరిలో దిగినా సింగిల్ డిజిట్ కే పరిమితమైంది..ప్రధానమంత్రి మోడీ వచ్చి ఇక్కడ అభివృధ్దిని సోమాలియాతో పోల్చడం కూడా రివర్స్ అయిందని స్పష్టంగా తెలుస్తోంది..ఈ పోలికపై అటు ఎల్డీఎఫ్..యూడిఎఫ్ రెండు కూటములు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఓటర్ సెంటిమెంట్ బిజెపి పాలిట శాపంగా మారిందంటారు

2016 Kerala elections are really shock to all. Present ruling party congress was lost, most of their cabinet ministers were lost.