అచ్యుతాగ్రహం

23 May 2016


కేరళ తదుపరి సీఎంగా పినరాయి విజయన్ పేరును ప్రకటించాలని సీపీఎం అధిష్ఠానం నిర్ణయించడం ఆ పార్టీలో చీలిక తెస్తుందా, ఇప్పుడిదే అనుమానం సిపిఎం కేడర్ ని వేధిస్తోంది. సిఎం పదవికి పోటీ పడ్డ అచ్చుతానందన్ అసంతృప్తితో వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. కేరళ సిఎంగా పి.విజయన్ ను ముఖ్యమంత్రిగా సిపిఎం కమిటీ నిర్ణయించింది. ఐతే ఈ నిర్ణయం సిఎం పదవిపై ఆశలు పెట్టుకున్న 93 ఏళ్ల అచ్యుతానందన్‌కు నిరాశే ఎదురైంది. అంత వృధ్దాప్యంలోనూ మండుటెండల్లో ప్రచారం చేయడమే కాకుండా  పోటీ కూడా చేసిన అచ్చుతానందన్ కనీసం రెండేళ్లపాటైనా పదవి కోరుకుంటున్నారట. అందుకే విజయన్ ను సెలక్ట్ చేస్తున్నట్లు ప్రకటించగానే, మీటింగ్ నుంచి వెళ్లిపోయారంటున్నారు.

కేరళలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలను చూస్తుంటే సిపిఎంలో చీలిక వచ్చే అవకాశం ఉందంటున్నారు. అక్కడి రాజకీయ పార్టీల్లో చీలికలు చాలా సహజం, కాంగ్రెస్ నుంచి చీలిపోయిన రకరకాల కాంగ్రెస్ లు పెట్టుకున్నవాళ్లున్నారు. అందుకే ఇప్పుడు వృధ్దనేత ఆగ్రహం అసంతృప్తి సిపిఎంలో చీలికకు బీజం వేస్తాయేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ విజయంలో కీలక పాత్ర పోషించిన 94 ఏళ్ల  అచ్యుతానందన్‌నుకాదని పినరాయి విజయన్‌ను సిఎం గా కూర్చోబెట్టాలనుకోవడం డేరింగ్ స్టెప్పే, వయస్సు మళ్లిన నేత కాబట్టి ఇలా చేశాం ఆయన పార్టీకి విలువైన సూచనలిస్తున్నారు. ఫెడెల్ క్యాస్ట్రోలాంటి వారంటూ పొగడ్తలు కురిపించడం కూడా అచ్చుతానందన్ కి పుండుపై కారం జల్లినట్లైందంటారు. ఐతే అచ్యుతానందన్ ఆగ్రహం అసంతృప్తిని లెఫ్ట్ నాయకత్వం ముందే పసిగట్టి, చీలికలను నివారించే వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. అచ్చుతానందన్ మాత్రం కనీసం రెండేళ్లు కుదరకపోతే ఆర్నెల్లైనా ముఖ్యమంత్రి పదవి కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

Kerala politics taking different diversions. CPM party decided Vijayan as CM. So Achuthanandan was walkout with this decision.