కత్తి సంక్రాంతికి దిగుద్దట

2 May 2016


చిరంజీవి 150వ సినిమా ఎట్టకేలకు ఓపెనింగ్ నామినల్ షాట్ పడింది, ముహూర్తాలు లేవనే సెంటిమెంట్ తో ఇవాళ చిరంజీవి స్వగ్రహంలో ఫ్యామిలీ మెంబర్లందరి మధ్య కోలాహలంగా ప్రారంభమైంది. దీనికి దర్శకుడు వివి వినాయకే(పాపం పూరీ జగన్నాధ్). నిర్మాత రామ్ చరణ్( పాపం బండ్లగణేష్) ఐతే దీనికి కొణిదెల ప్రొడక్షన్స్ అని కొత్త బ్యానర్ ఎందుకు పెట్టారో తెలియదు. ఆల్రెడీ అంజనా ప్రొడక్షన్స్ అని ఓ సొంత సంస్థ ఉంది. బహుశా అది నాగేంద్ర బాబుకే పరిమితం అయినట్లుంది. 

సరే విషయానికి వస్తే ఇది కత్తికి రీమేక్..కత్తిలాంటోడు టైటిల్. హీరోయిన్, తారాగణం ఏదీ  చెప్పలేదు. ఐతే ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎవరైతై ఇప్పటిదాకా అన్ని సినిమాల్లో కన్పిస్తున్నారో వారే ఉంటారు. కత్తి ఒరిజినల్ వెర్షన్ లో నటించిన విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టులను దింపినా దింపొచ్చు.

ఐతే సినిమా సంక్రాంతికి వస్తుందని చెప్తున్నారు కానీ అంత సీన్ ఉండకపోవచ్చు ఎందుకంటే, ఇది ఏప్రిల్ నెల ఐపోయింది, మే బిగినైనట్లే ఏడునెలల్లో షూటింగ్ పూర్తి చేసే స్పీడ్ అటు వినాయక్ లో కానీ, ఇటు చిరంజీవిలో కానీ లేనేలేవు. ఓ వేళ ఐతే ఈ సినిమా స్క్రిప్ట్, ఎక్కడెక్కడ షూటింగ్ చేయాలి. ఎవరెవర్ని తీసుకోవాలనే అంశం ఇప్పటికే కన్ఫామ్ అయి ఉండాలి. నటుడు, సింగర్ గీతామాధురి భర్త నందు ట్వీట్ చేశాడు. కాబట్టి ఈ సినిమా గురించి అతనికో క్యారెక్టర్ ఉంది కాబట్టే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉండి ఉండాలి. అలా అంతా ముందే సెట్ చేసుకుని ముహూర్తం మాత్రం ఇవాళ చేసి ఉంటారని టాక్.

Total Chiranjeevi fans and mega family fans are waiting for Chiranjeevi 150th movie. Its good news to all Mega family fans, Chiranjeevi announced, Kathi Lantodu movie will release for Sankrathri. But it is not possible to complete shooting with in seven months.