కమల్ -బ్రహ్మీ సూపర్ కాంబినేషన్

2 May 2016


కామెడీలో కమల్ హసన్ టైమింగ్, హావభావాలు ఓ రేంజ్ లో  ఉంటాయ్. చాలా సీరియస్ గా చేస్తూ, చూసేవాళ్ల పొట్ట పగిలిపోయేలా నవ్వు తెప్పించడంలో ఆయనకి ఆయనే సాటి. మరి లాఫ్ట్ వేర్ ఇంజనీర్ బ్రహ్మానందం కామెడీ సంగతి సరేసరి, ఆయన్ని చూస్తే చాలు నవ్వులు కురిసిపోతాయ్, అలాంటి వీరిద్దిరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోంది. అదే శభాష్ నాయుడు, దశావతారంలో సిబిఐ  ఆఫీసర్ బలరామ్ నాయుడు క్యారెక్టర్ ని లెంగ్త్ పెంచి తీస్తున్న ఈ సినిమాలోనే శృతిహాసన్ కూడా ఆయనకి కూతురుగా నటిస్తోంది.

మొత్తం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా వస్తుందిట. అలా అంటున్నారు కానీ కొన్ని కొన్ని క్యారెక్టర్లని మాత్రమే ఆయా భాషల నటులను తీసుకుని లాగించేస్తారని అందరికీ తెలిసిందే. ఐతే బ్రహ్మానందం..కమల్ హసన్ కలిసి నటించిన సినిమాలు దాదాపు లేవనే చెప్పాలి. దీంతో ఈ ఇద్దరి కామెడీ టైమింగ్ లో వచ్చే హాస్యసన్నివేశాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. దాన్ని పక్కనబెడితే 60 ఏళ్లు దాటుతున్నా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్న కమల్ ఫిట్ నెస్ ను అభినందించకతప్పదు.

Kamal Hassan is care of address for acting and Bhramhanandham is care of address for comedy. Now both are doing a movie called Sabhash Naidu. It look like sequel of Dhasavatharam character.