గడ్డం సెంటిమెంట్

3 May 2016


కబాలి టీజర్ తో సూపర్ స్టార్ రజనీ మరోసారి సెన్సేషన్ క్రియేట్  చేస్తున్నాడు. ట్రైలర్ వదిలారో లేదో హిట్ల సంఖ్య మిలియన్లకుచేరిపోయింది. అసలు టీజర్ చివరి సీన్ లో చూస్తే ఈయన ఏజ్ తగ్గుతుందేమో కానీ పెరగడం లేదన్పించడంలో అతిశయోక్తి కాదు. ప్రతి సినిమాలో ఏదోక కొత్తదనం చూపిస్తూ, స్టైల్ కి అడ్రస్ లా మారడమే ఆయన సక్సెస్ సీక్రెట్ అంటున్నారు. కబాలి  టీజర్, సూపర్బ్ గా ఉందంటున్నారు  ఫ్యాన్స్, నిజమే అది అందులోనూ కబాలి అంటే ఏంటో చెప్తూ ఆయన అభినయం యూత్ కి మతి పోగొట్టింది. ట్రైలర్ చివర్లో కలర్ ఫుల్ షర్ట్ లో తలఎగరేస్తూ దూసుకుపోయిన స్టైల్ చూస్తే, 60ఏళ్లు దాటిన వ్యక్తిలా ఏమాత్రం కన్పించడు రజనీ. 60 ల్లో పాతికేళ్ల యూత్ గా ఎలా కన్పించగలుగు తున్నాడంటూ ఇప్పటి యూత్ కూడా ఆశ్చర్యపోకతప్పదు మరి. ఐతే రజనీకాంత్ సినిమాలు చూస్తే ప్రతి మూవీలో ఆయన క్యారెక్టర్ కి ఓ మేనరిజమ్, పంచ్ డైలాగ్స్ కామన్. వాటితో పాటు రజనీ కొన్ని ఏళ్లుగా ఓస్టైల్ ఫాలో అయిపోతున్నాడు. ఫ్రెంచ్ బేర్డ్, ఫుల్ గడ్డం, ఇలా గడ్డం బాబుగా అలరిస్తూనే ఫ్లాష్ బ్యాక్ లోనో, మరో క్యారెక్టర్లోనో నీట్ గా షేవ్ తో కన్పిస్తాడు రజనీ. రోబో సినిమా చూస్తే..సైంటిస్ట్ వశీకరణ్ క్యారెక్టర్ లో సినిమా అంతా గడ్డంతో కన్పిస్తాడు,
ఇక అంతకు ముందు వచ్చిన శివాజీ సినిమాలో బాస్, గుండుబాస్ అంటూ చేసిన హడావుడి ఎవరూ మర్చిపోలేరు. అందులో ఓ క్యారెక్టర్ కి క్లీన్ షేవ్ తో కన్పించగా, అంత యంగ్ గా ఎలా కన్పించారంటూ అప్పుడూ ఇదే డౌట్ పడ్డారు. 1999 లో వచ్చిన నరసింహ సినిమా కూడా డిటో, ఫస్ట్ హాఫ్ అంతా కుర్రాడిగా ఇరగదీస్తే, సెకండ్ ఆఫ్ లో ఫుల్ గడ్డంతో పుటుక తో వచ్చిన స్టైల్ కదా అదంత తేలికగా పోదంటూ పంచ్ విసురుతాడు రజనీ.సేమ్ పాట్రన్ అరుణాచలం మూవీలో కూడా ఉంది. తండ్రి క్యారెక్టర్లో తెల్లగడ్డంతో హుందాగా దర్శనమిచ్చాడు. 

1995 లో వచ్చిన ముత్తు కూడా సేమ్ ట్రెండ్, దానికి ముందు తెలుగు,తమిళనాడును షేక్ చేసిన బాషా మూవీలో ఫ్రెంచ్ బేర్డ్ సంగతి చెప్పక్కర్లేదు. భాషా...మాణిక్ భాషా అంటూ విలన్ కళ్లలోకి చూస్తే చెప్పే డైలాగ్స్ కూడా మర్చిపోం..కెరీర్ బిగినింగ్ నుంచి కూడా రజనీ కాంత్ బోలెడన్ని గడ్డం హీరో క్యారెక్టర్లు చేశారు, చూస్తుంటే స్టైల్ రజనీకాంత్ ని ఎలా వదిలివెళ్లదో గడ్డం లేని క్యారెక్టర్ కూడా సూపర్ స్టార్ కి అచ్చి రాదేమో. సినిమా అంతా క్లీన్ షేవ్ తో కన్పించినా, చంద్రముఖి రాజు క్యారెక్టర్లో మాత్రం మినహాయింపు ఉండటం మనం గమనించవచ్చు..అందుకే రజనీనే స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పక తప్పదు.

Rajanikanth is always a record. Rajanikanth latest movie Kabali teaser released recently. With in short time of releasing teaser it got more hits and it created record.