మలైలో కబాలి కేక

24 May 2016


సూపర్ స్టార్ రజనీ కాంత్ స్టార్ డమ్ ఆయన ఉన్నంతవరకూ ప్రపంచంలోని నాలుగు మూలలకూ విస్తరిస్తుందేమో, ఎందుకంటే ఇప్పటికే జపాన్, సింగపూర్, మలేషియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న రజనీ ఇప్పుడువారి వారి భాషల్లోకి తన సినిమా అనువాదం చేసే రేంజ్ కి చేరాడు. మలేషియాలోని అఫిషియల్ లాంగ్వేజ్ మలై. కబాలి ఇప్పుడా భాషలోకి ట్రాన్స్ లేట్ అయి రిలీజ్ కాబోతోంది. మామూలుగా తమిళ్ మూవీ అలానే విడుదల చేసేవాళ్లు, కానీ ఇంకా చొచ్చుకుపోవాలంటే డబ్బింగ్ చేయడమే ముఖ్యమని, ప్రొడ్యూసర్ కలైపులి థాను ఫీలింగ్, అందుకే ఇంతవరకూ ఏ సినిమాకి లేని ఘనత దక్కించుకున్నాడు కబాలి.

మలేషియాలోని ముఖ్యప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడంతో ఇక నేటివిటీ ప్రాబ్లెమ్ కూడా లేనట్లే. కేస్టింగ్ లోనూ మలేసియా యాక్టర్లున్నారు, అలా సినిమా చూసినవాళ్లకి మలేషియా సినిమానే చూసిన ఫీలింగ్ కలగొచ్చు. కలెక్షన్లు కొల్లగొట్టొచ్చు, అదే జరిగితే ఇక కబాలి రిలీజ్ కి ముందే సూపర్ సక్సెస్ సాధించినట్లు లెక్క.

Now Tamil Super Star Rajanikanth popularity spread world. His latest movie Kabali is dubbed in to Malaysia official language.