కేటీఆర్ భజన

23 May 2016


రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులూ ఒకే బాటలో పయనిస్తుంటారు. ఎప్పటికప్పుడు  ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటారు, వాళ్ల  సొంత రాష్ట్రాల కోసం తపన పడుతున్నట్లు బిల్డప్ ఇస్తుంటారు, అంతలోనే ఇద్దరూ తెగ క్లోజైనట్లు ఫోజులు కొడుతుంటారు. ఎవరైనా కాస్త పేరున్న పారిశ్రామికవేత్తలు వస్తే, ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. తమ రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టమంటారు, ఆ తర్వాత ఆ పేరుతో విదేశాలకు చెక్కేస్తుంటారు. అక్కడా అదే భజన, జనం కోసం పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు ఒకటే లీకులు ఇస్తుంటారు. అంతకు ముందు నారా లోకేష్ యూఎస్ వెళ్లి తెగ ఆహ్వానాలు పలికాడంటూ తెలుగు మీడియాకి వీడియోలు పంపి తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వంతు కేటీఆర్ ది వచ్చింది, ఇంతకు ముందు వెళ్లినా, ఇప్పుడు మళ్లీ బార్న్ స్టాడ్, ఇండియానా స్టేట్స్ లో పర్యటిస్తారట. ఐతే ఆయనగారి టూర్ రెడీ అయిందో లేదో ముందే టీ మీడియాకి లీకులు, ఎలా స్క్రోలింగ్ రావాలో ఆదేశాలు వెళ్లిపోయాయ్. ఇక అక్కడేదో చిన్న చిన్న సదస్సులు జరగడం, అక్కడ ఆయన ఉపన్యాసాలు ఇవ్వడం దానికి ఏదో చీఫ్ గెస్ట్ వచ్చిన రేంజ్ లో ఇక్కడ టివీల్లో హడావుడి చేయడం జరగబోతున్నాయ్. ఈ నెలాఖరుదాకా మేం చెప్పిన విషయాలు అన్ని ఛానళ్లలో షెడ్యూల్ తో సహా ప్రసారం చేయడం చూస్తారు ఇక  కాస్కోండి మరి.

Present it is a trend to both CM sons. Going to foreign countries for invite investments to state. sending videos to media. Now KTR is going to foreign to attract investments but it was firstly leaked to T-media.