భజనాగ్రేసరుడు

27 May 2016


ఎన్నడూ లేనిది కర్నూలు సీనియర్ నేత, ఏపి డిప్యూటి సిఎం కేఈ కృష్ణమూర్తి చంద్రబాబుకి విపరీతమైన భజన చేశారు. అసలు ఇలాంటి నేత ఇంకోరు పుట్టరనేశారు. ఇది నిజంగా అభిమానంతో అన్నదేనా, లేక ఇన్ డైరక్ట్ గా దెప్పుతున్నారా అని కూడా లోలోపల టాక్ నడుస్తోంది. కలెక్టర్ల సదస్సులో కేఈ ఇలా చంద్రబాబును మోసేయడం సొంతపార్టీ నేతలకే ఆశ్చర్యం కలిగించిందట. ఏపికి సమర్ధవంతమైన నేత బాబు ఒక్కడే అన్న కేఈ ఆ సంగతి జనానికి తెలుసు కాబట్టే, ఓట్లేశారనే సంగతి గుర్తుంచుకోవాలి. 

ఐతే ఈ పొగడ్తలు కేఈ నోటి వెంట రావడమే విడ్డూరం ఎందుకంటే రెవెన్యూ మంత్రిగా ఏపీ కెపిటల్ ప్రాంతంలో పర్యటించాల్సి ఉన్నా, ఆయన అక్కడకు వెళ్లరు. దీనికి బాబుతో ఆయనకున్న విబేధాలే కారణమంటారు. అలాంటిది ఇప్పుడు ఈ చిడతల భజనకు తొందర్లో మంత్రివర్గంలో మార్పులు చేస్తారనే టాక్ రావడమే మూలమని తెలుస్తోంది. చినబాబును రేపు మహానాడులో పొగిడింపుల పర్వం ఉండగా..ఇప్పుడే బాబును మచ్చిక చేసుకోవడంతో పాటు..భవిష్యత్తులో తన సీటుకు ఎసరు రాకుండా చూసుకోవడమే ఈ భజన వెనుక అసలు ఉద్దేశమంటున్నారు.

AP deputy CM KE Krishna Muthy comments about Chandrababu is very funny. He priding him. The rumor is he is differ form Chandrababu.