జంప్ జలీల్ కూడా మాట్లాడేస్తున్నాడు

6 May 2016


బిజెపి ఛస్తే ఏపీలో అధికారంలోకి రాదట, ఇది మేం అన్న మాట కాదు. ముందు కాంగ్రెస్ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి ఇప్పుడు టిడిపిలోకి జంప్ కొట్టిన జలీల్ ఖాన్ డైలాగ్. ఈయన లెక్కల ప్రకారం అసలు బిజెపి ఏదో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తాపత్రయపడుతుందట, పైగా ఆ పార్టీ మతతత్వ పార్టీ అట. హర్రర్రే..అసలు ఈ సంగతి ఎలా ఎప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలీదు కానీ జలీల్ ఖాన్ ఇప్పుడు ఏదైతే తన నియోజకవర్గ అభివృధ్ది కోసం తెగ ఆరాటపడి పార్టీ మారాడో, ఆ పార్టీ ప్రభుత్వంలోనే బిజెపి భాగస్వామి ఐనా మనోడు ఇలా ఎందుకు మాట్లాడాడోనంటూ తెగ జుట్టు పీక్కోనక్కర్లేదు.

ఎటూ టిడిపి బిజెపి రిలేషన్ దెబ్బతిన్నది, వచ్చే ఎన్నికల నాటికి మంచి బ్యాక్ గ్రవుండ్ ప్రిపేర్ చేసుకోవడానికి టిడిపినేతలు ఇలాంటి వారిని ఉసిగొలుపుతున్నారు. అందుకే ఆ పార్టీపైకి అటాక్ ప్రారంభించారు. ఇంత జరిగినా మధ్యలో వైఎస్సార్సీపీ పై పడి వాపోవడం మాత్రం మానలేదు. అసలా పార్టీ లేకపోతే విభజనే జరిగేది కాదంటూ రెటమొతం వాదన ప్రారంభించాడాయన. అదే నిజమైతే  ఆ పార్టీ లేకపోతే జలీల్ ఖాన్ కి గెలవడానికి ఓ  పార్టీనే ఉండేది కాదు. ఐతే జనం పిచ్చోళ్లు కాదు కదా, ఐతే కాంగ్రెస్ ని కాదంటే బిజెపిని నమ్మడానికి వాళ్లకి కావాల్సినన్ని ఆల్టర్నేటివ్ లు ఉన్నాయ్.

Vijayawada MLA Jaleel Khan comments are very shocking. Yesterday he was commented about BJP. May be he dont know TDP is part of NDA.