జయదేవ గా ఎన్టీఆర్

6 May 2016


తాత జగదేకవీరునిగా నటిస్తే, జూనియర్ జయదేవ్ గా కన్పించబోతున్నాడట. ఇదీ ప్రస్తుతం సర్కిలవుతున్న న్యూస్. హిట్టే తప్ప ఫ్లాపవని హ్యాట్రిక్ కాంబినేషన్ రాజమౌళి-జూనియర్ ది స్టూడెంట్ నంబర్, సింహాద్రి, యమదొంగ మూడు ఒకదాన్ని మించి ఒకటి ఆడినవి. కష్టకాలంలో జూనియర్ కి హిట్లిచ్చినవి. ప్రస్తుతం మనోడి సీజన్ డల్ గా ఉంది.
ఏ సినిమా చేసినా, ఓపెనింగ్ రోజు హడావుడి తప్ప రన్నింగ్ లేని సినిమాలే జూనియర్ ఎన్టీఆర్ కి వస్తున్నాయ్. ఈ దశలో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా పని చేస్తున్నాడు. ఐనా ప్రయోజనం శూన్యం, అందుకే ఈలోపు ఏదోక హిట్ మూవీలో మెరిస్తే ఆ సక్సెస్ ని తర్వాతి మూవీలో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడని టాక్.

అందుకే రాజమౌళి బాహుబలి రెండో భాగం(సినిమా)లో జయదేవ్ అనే క్యారెక్టర్లో కన్పిస్తాడట. ఇది తమిళంలో సూర్య చేస్తాడంటున్నారు. ఐతే మొదటి భాగంలో సుదీప్ చేసిన క్యారెక్టర్ ఈ రెండో భాగంలో కన్పించొచ్చు, అలా జూనియర్ ఎన్టీఆర్ కూడా కన్పించే అవకాశం కన్పిస్తోంది. ఐతే ఇది ఏ ఐదునిమషాలు ఉంటుందా. లేక ఓ పావుగంట నడిపిస్తాడా అనేది సినిమా చూస్తేకానీ తెలీదు. ఐతే ఇంతమంది కన్పిస్తే ఇప్పటికే ఏ సినిమాలు చేయకుండా గోళ్లు గిల్లుకుంటూ కండలు పెంచుకుంటున్న ప్రభాస్, తన పాపులారిటీ షేరవుతుందేమో అనుకోవచ్చు మరి.

Jr NTR is doing in Baahubali-2 as Jayadev Character. Recently Rajamouli contacted NTR for offering this character. In Tamil this character is doing by Surya.