నర్గీష్ ఫక్రీ మగాళ్లని నమ్మదట

4 May 2016


హీరోయిన్ నర్గీస్ ఫక్రీ అజరుద్దీన్ లైఫ్ పై వస్తున్న బయోపిక్ లో నటిస్తోంది. ఈ ప్రమోషన్ కి వచ్చిన ఫక్రీ తానసలు మగాళ్లని ఎక్కువగా నమ్మనంటోంది. సంగీతాబిజ్లానీ క్యారెక్టర్లో చేస్తున్న నర్గీస్, ఆ పాత్రతో ఎలా ఐడెంటిఫై అవుతారన్న ప్రశ్నకి సమాధానంగా అసలు ఓ ఇద్దరు సెలబ్రెటీలు లవ్ చేసుకోవడం తర్వాత పెళ్లాడటం మన సొసైటీలో చాలా కష్టమని, అంత ఒత్తిడి తాను భరించలేనని చెప్పింది. అలానే ఇండస్ట్రీలో తనకి స్నేహితులు చాలా తక్కువని, ఇకపై ఎవరితో ఫ్రెండ్షిప్ చేసేది లేదని కూడా చెప్తోంది.

గతంలో రణబీర్ కపూర్ తో ఈ నలకనడుము భామ డేటింగ్ చేసిందని టాక్. ఐతే ఇండస్ట్రీ బైట చాలామంది గై ఫ్రెండ్స్ ఉన్నారని వారితో స్కైప్ లో రోజూ ముచ్చటిస్తానని అంటోంది నర్గీస్ ఫక్రీ. ప్రస్తుతం సినిమాలు ఏవీ లేకుండా ఫంక్షన్లు, .ఈవెంట్లతో నెట్టుకొచ్చేస్తున్న ఫక్రీకి అజర్ మూవీనే కాస్త ఆశ కలిగిప్పటికే ఆడియెన్స్ లో క్రేజ్ పెంచేసింది. సినిమా హిట్టైతో ఓ నాలుగు ఛాన్సులొస్తాయని నర్గీస్ ఆశపడుతోంది.
Heroin Nargise Fakri is now doing in Biopic movie. It is film doing with the story of Ajarudheen. And she is expecting she will get more chance with this movie. She is telling i dont believe Mes.