చిరుకు హీరోయిన్స్ నో చెప్తున్నారా..?

18 May 2016


ఇలానే అనుకుంటున్నారు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో 150వ సినిమా అంటూ ఊరిస్తూ వస్తున్న చిరు, ఎట్టకేలకు దాన్ని ప్రారంభించాడు. ఐతే ఓపెనింగ్ అయితే జరిగింది కానీ ఇప్పటిదాకా సెట్స్ పైకి పోలేదా మూవీ, దానికి తోడు మెగాస్టార్ కి జోడీ కుదరకనో, దొరకకనో ఇప్పటిదాకా హీరోయిన్ని కన్ఫామ్ చేయలేదు యూనిట్. ఓరోజు నయనతార, మరో రోజు త్రిష తర్వాత  ఇప్పుడు అనుష్క పేరు విన్పిస్తుందా ప్లేస్ లో. ఐతే చిరంజీవి లాంటి ఓల్డ్ హీరో సరసన నటించడానికి ఎవరూ ముందుకు రావడంలేదనేది టాక్, ముదురుపడ్డ ఫేస్ తో కన్పిస్తున్న చిరు సరసన అనుష్కని నటించపజేసేందుకు ట్రయల్స్ మొదలయ్యాయట. ఐతే ఆమె కూడా చిరుని మీట్ అవలేదు, పైకి మాత్రం అనుష్క ఇందులో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నానంటూ చెప్తోంది. కానీ సింగమ్ త్రీ, బాహుబలి 2 ఈ రెండు సినిమాలు తర్వాత భాగమతి సో అనుష్క డేట్స్ ఖాళీ లేవ్. మరిప్పుడు వీటినే సాకుగా చూపించి తప్పుకుంటుందో, లేక ఎలాగోలా అడ్జస్టై యాక్ట్ చేస్తుందో చూడాలి మరి.

Total mega family fans are waiting for Chiranjeevi 150th movie. But still is not on sets. It facing director problem and now heroin problem.