సునీల్ చేతిలో అన్ని సినిమాలా..?

2 May 2016


కామెడీ వేషాలేస్తూ, .సర్ర్. మని దూసుకొచ్చి హీరో అయిపోయిన సునీల్ హిట్లు లేక  కరువాసి ఉన్నాడు. పెద్ద పెద్ద బ్యానర్లలో మనోడిని పట్టించుకున్నోళ్లు లేరు. కామెడీ వద్దనుకుని అసలుకే ఎసరు పెట్టుకుంటున్నాడనే దిగులూ ఎటూఫ్యాన్స్ లో ఉంది. వచ్చిన ప్రతి సినిమా పోతుంటే, సునీల్ ని అభిమానించేవాళ్లకి ఆవేదన, చెప్తే విన్నాడు కాదంటూ ఎగతాళి చేసే నటులూ ఉన్నారు. ఐతే వాళ్లందరికీ షాక్ ఏంటంటే ప్రస్తుతం సునీల్ చేతిలో 4 సినిమాలు రెడీగా ఉన్నాయ్.

వీటిలో ఏ ఒక్కటి హిట్టైనా మరో నాలుగు ఆఫర్లు రావడం ఖాయం, వంశీకృష్ణ అనే కొత్త డైరక్టర్ తో జక్కన్న, పోటుగాడు. వీరు పోట్ల డైరక్షన్ లో ఈడు గోల్డెహ షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయ్. క్రాంతిమాధవ్ డైరక్షన్ లో మరో సినిమా పట్టాలెక్కింది. డైరక్టర్ ఎన్ కౌంటర్  శంకర్ ప్రొడ్యూస్ చేస్తున్న మరో సినిమాలోనూ మనోడే హీరో. తెలుగులో ఇన్ని సినిమాలు రెడీగా చేతిలో ఉన్నది ఒక్క  సునీల్కే. క్రేజ్  ఉండి చేయని మహేష్, పవన్ కల్యాణ్, నాగార్జున, నాగచైతన్య, రామ్ చరణ్ సంగతి పక్కనబెట్టండి. మిగిలినవాళ్లు కూడా సునీల్ లా వరసగా సినిమాలు చేస్తేనే, వందల కుటుంబాలు బతుకుతాయ్.

Hero Sunil started her carrier as comedian. As a comedian he did so many movies. With Maryadha Ramanna movie Sunil doing movies as hero. Now when comparing with all Tollywood heroes he doing more movies. Now he is doing four movies.