ఛాన్సుల కోసం ఇంతగా దిగజారాలా నాగశౌర్యా?

24 May 2016


యూత్ హీరో నాగశౌర్య తన టాలెంట్ కన్నా కూడ భజననే ఎక్కువ నమ్ముకున్నట్లుంది. ఇది మా సొంత ఆరోపణ కాదు, ఒక మనసు ఆడియో ఫంక్షన్లో అతగాడి స్పీచ్ చూడండి, మీరే గమనించవచ్చు. అప్పుడెప్పుడో సావిత్రి, తర్వాత సౌందర్య, అనుష్క, ఆ తర్వాత ఇక నీహారికే అని అన్నాడు. అది స్టేజ్ పై ఉన్నవాళ్లకి ఆనందం కలిగించవచ్చు కానీ, వాస్తవం తెలిసినవాళ్లు నాగశౌర్య మంచి బిస్కెటేశాడు అనుకోరా...! కనీసం ఓ పదాన్ని ఉచ్చరించడం, దాని అర్ధం తెలీని సౌందర్య , అనుష్కలు సావిత్రితో పోల్చడం అతగాడి అజ్ఞానం. అసలు సావిత్రి తప్ప తెలుగులో మహానటి లేరనుకోవడమే ఓ రకమైన అతిశయించిన అభిమానం ఎందుకంటే సావిత్రి గొప్ప నటే కావచ్చు కానీ, అంతకన్నా గొప్పనటీమణులు ఉన్నారు కానీ వారికి అన్ని హిట్ సినిమాలు రాలేదు. 

అంత గొప్ప అందం లేదు, అంత మాత్రాన వారికే కిరీటం పెట్టడం నిజమైన కళాపిపాసులకు ఔచిత్యం అన్పించుకోదు. కనీసం ఒక్క సినిమా కూడా విడుదల కాని, నీహారికని వాళ్లతో పోల్చడం బావిలో కప్పలాంటి నాగశౌర్యకే చెల్లింది. నిండుగా చీర కట్టుకోవడం ఒక్కటే నటనకు కొలమానం అయితే, కోవై సరళకి మించిన వారుండరు. ఇక్కడ అది కాదు విషయం అసలు నాగశౌర్యకి ఉన్న సినిమా పరిజ్ఞానం ఎంత, ఆయన చూసిన నటులెందరు, మేం చెప్పేది మీకు రుచించకపోవచ్చు కానీ ఒక్క ఐదు నిమిషాలు ఆలోచిస్తే ఖచ్చితంగా వాస్తవమేంటో బోధపడుతుంది. మెగా కాంపౌండ్ చాలా పెద్దది, వాళ్లలో నిర్మాతలున్నారు, నటులున్నారు వారి అభిమానం చూరగొంటే ఇండస్ట్రీలో ఓ నాలుగైదు సినిమాలు వస్తాయనే ఉద్దేశంతో మాట్లాడితే మాట్లాడొచ్చు కానీ. ఇలా చీప్ కామెంట్లు మాత్రం నిజమైన కళాభిమానులకు ఆగ్రహం తెప్పించకమానదు(ఇక్కడ నీహారిక నటనాప్రతిభ గురించి మేం తక్కువ చేయలేదు..గమనించగలరు).

Young hero Naga Showrya did movie with Mega heroin Niharika. In this movie audio function Naga Showrya comments are very funny. He compared Niharika with Savitri.