ఎంటర్ ది ట్విట్టర్

27 May 2016


వైవిధ్యమైన కథలున్న సినిమాల్లో నటించే హీరోల్లో తమిళ హీరో కార్తి ఒకడు. ఇతగాడి బర్త్ డే రోజున ట్విట్టర్లో ఎంటరయ్యాడు. ఆవారా మూవీ హిట్ తో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైన కార్తి, ఊపిరితో మరింత దగ్గరయ్యాడనే చెప్పాలి. మొదట్లో మంచి జోరుమీదున్నా, శకుని ఫ్లాపవడంతో చతికిలబడ్డాడు. ఆ తర్వాత కూడా పెద్దగా సక్సెస్ లు లేవ్. అన్న సూర్య తర్వాత ఇండస్ట్రీకి వచ్చినా, తనకంటూ ఓ ప్లేస్ ఏర్పరుచుకున్నాడు కార్తి. 

ట్విట్టర్లో తన ఫోటోతో పాటు, కొత్త సినిమా కాష్మోరా ఫస్ట్ లుక్ పోస్ట్ చేశాడు.  రెండ్రోజుల క్రితం తన బర్త్ డే సందర్భంగా  చెన్నైలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి రోగులకు 200 దుప్పట్ల పంపిణీ, రక్తదానం లాంటి కార్యక్రమాలు చేశాడు కార్తి. అలానే సిటీలోని వాల్‌టాక్స్‌ రోడ్డు, పాడిలో పేదలకు అన్నదానం, రాయపేట, ఒట్టేరి తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి, సోషల్ సర్వీస్ లోనూ పేరుతెచ్చుకుంటున్నాడు.

Kollywood hero Kaarthi introduced to telugu people with Awara movie. With Oopiri movie he got more intact with Telugu people. To his birthday he opened twitter account.