ఆ ముచ్చటా తీరింది

2 May 2016


ప్రత్యేక హోదా రానే రాదని, ఆంధ్రాపల్స్ ఎప్పట్నుంచో చెప్తోంది. ఇప్పుడు కేంద్రమంత్రి హరిభాయ్ ఛౌదరి కూడా అదే నిండుసభలో తేల్చేశారు. అంతటితో ఊరుకోకుండా ఏపీకి హోదా అవసరమే లేదన్నారు. ఇంతకంటే అవమానం ఇంకేమైనా ఉందా..? పైగా పార్లమెంట్ లో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ రెండు పార్టీలు ఈ అంశంపై చర్చకు దిగినా, టిడిపి సపోర్ట్ ఇవ్వకపోగా, కాంగ్రెస్సే ఏపీని నాశనం చేసిందంటూ చరిత్ర తవ్వబోయారు. వైసీపీ ఎంపి మేకపాటి మాత్రం ప్రత్యేక హోదా అంశంపై తాము టిడిపి పోరాడితే మద్దతిస్తామని కూడా చెప్పారు. ఈ దశలో ఒకరినొకరు తిట్టుకోవడం మంచిది కాదు, అదే మేకపాటి కూడా చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపి  కేవీపీ కూడా అనవసర సాకులు వెతుకవద్దని కేంద్రానికి సూచించారు. దానికి తోడు ఓ సవాల్ కూడా విసిరారు.

అప్పట్లో తెగ హైరానా పడి నానా డ్రామాలు ఆడిన వెంకయ్యనాయుడు ఇప్పుడు తప్పు ఒప్పుకోవాలని, తెలియక అప్పట్లో హోదా అడిగామని చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. పనిలో పనిగా పోలవరంపై కూడా నిలదీశారు. ఐనా మంత్రి ఇలా కుండబద్దలు కొట్టడంతో ఇక బిజెపి-టిడిపి దొంగనాటకాలు బైటపడినట్లే అని భావిస్తున్నారు. ఇప్పుడిక ఎవరి వెనుక నిలబడాలనేది ఏపీ  ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రతిదానికి కేంద్రంపై దేబిరిస్తున్నారని కాంగ్రెస్ సిఎంలపై అప్పట్లో విమర్శలు చేసిన టిడిపి అధినేత ఇప్పుడేమంటారో. కేంద్రం 2018, 2019లో ఇస్తుందంటూ నక్క జిత్తులు ప్రదర్శిస్తారో, కేబినెట్ నుంచి బైటికి వచ్చి నిరసన తెలుపుతారో తేలాలి.

All AP peoples and students and unemployed are waiting for AP Special status. And TDP government is also saying we will get special status from BJP government. But Central minister Haribai Choudary declared AP will not special status.