ప్రయాణికులకు విజ్ఞప్తి

24 May 2016


రైల్వేశాఖ ఎట్టకేలకు కాస్తంత జనానికి ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ, హౌరా, ముంబై, చెన్నై, బెంగళూరు ,సికింద్రాబాద్ రూట్లలో నడిచే రైళ్లలో ఇకపై వెయిటింగ్ లిస్ట్ ఉండదు. వికల్ప్ అనే స్కీమ్ కింద అదే రూట్లో వెళ్లే రైళ్లలో ఖాళీలుంటే బెర్త్ కన్ఫామ్ చేసుకుని వెళ్లొచ్చు. ఈ ప్లాన్ సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ కి పరిమితం. రాజధాని, దురంత్, శతాబ్ది రైళ్లకి మినహాయింపు నిచ్చిన ప్రభుత్వం ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జీలు వసూలు చేయదు. అలానే ఛార్జీల్లో తేడాలున్నా చెల్లించదు.

దీంతోపాటు... జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయ్. తత్కాల్ టిక్కెట్లు కూడా రద్దు చేసుకుంటే సగం డబ్బు వెనక్కి  ఇవ్వడం మరో కొత్త ఊరట. ఏసీ బుక్ చేసుకోవాలంటే మాత్రం ఒక గంట మాత్రమే ఇచ్చారు. ఉదయం పది నుంచి పదకొండు సమయం ఫిక్స్ చేశారు. ఐతే రైల్వేశాఖ చెప్తున్నట్లుగా  వెయిటింగ్ లిస్టులుండవనేది గత రెండేళ్లుగా చెప్తున్నదే అయినా ఇంతవరకూ అమల్లోకి రాలేదు, దాని విధివిధానాలు ఇప్పుడెలా ఉంటాయనేది రైలు ప్రయాణీకులకు కాస్త ఆసక్తి కలిగిస్తోంది. ఎఁదుకంటే భారీగా పెరిగిపోయిన బస్ ఛార్జీలతో పోల్చుకుంటే, రైలు టిక్కెట్లు తక్కువ కాబట్టి ఎక్కువ మందికి మేలు చేసే అవకాశం కన్పిస్తోంది.

It is really good news to Railway passengers. Central government passed new rule if any passenger is in waiting list, he/she can go another train by conforming bearth with out extra charges.