శ్రీముఖికి షాక్ ఇచ్చిన మారుతి

24 May 2016


జెంటిల్ మెన్ ఆడియో రిలీజ్ లో డైరక్టర్ మారుతి ఖచ్చితమైన షాక్ ఇచ్చాడు ఇద్దరు యాంకర్లకి ఒకరు శ్రీముఖి, మరొకరు రవి వీళ్లిద్దరూ ఈటీవీ ప్లస్ లో ఓ ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేస్తున్నారు. జెంటిల్ మెన్ ఆడియోకి వచ్చి వీళ్లిద్దరూ ఓవరాక్షన్ చేస్తూ, మీ రొమాంటిక్ మూమెంట్స్ గురించి చెప్పడంటూ గెస్ట్ లను, యూనిట్ క్రూని అడగడం ప్రారంభించారు. అసలు అడగడం ఏంటో ముందు వారికి క్లారిటీ ఉండాలి, లేదంటే ఇఁగ్లీష్ వచ్చి ఉండదు. కానీ ఈ తెలుగు యాంకర్లలో చాలామంది తెలుగు కంటే ఇంగ్లీషే ఎక్కువ వాడుతుంటారు. ఐనా ఇలా అడిగారంటే కావాలనే చేశారు.

గతంలో మీరెవరినైనా ప్రేమించారా, లేక ఎవర్నైనా ఇష్టపడ్డారా ఇలాంటి ప్రశ్నలు అడగాల్సి ఉండగా రొమాన్స్ ఎలా చేశారు, అవేంటి, ఎంతమంది అని అడిగేసరికి డైరక్టర్ మారుతికి చిర్రెత్తుకొచ్చినట్లుంది. మేం సినిమాల్లో బూతు చూపిస్తాం, డబుల్ మీనింగ్ మాట్లాడిస్తాం అంతే కానీ మమ్మల్ని మీరు అలా ఎలా అడుగుతారనుకున్నాడో ఏమో, మారుతి రవి ని పిలిచి" నువ్వెంతమందితో రొమాన్స్ చేశావ్, ఎలా చేశావ్, ఎన్నిసార్లు చేశావ్, ఎక్కడ చేశావ్" అని చెడామడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపారేశాడు. దీంతో ప్రోగ్రామ్ లో కాసేపు హీట్ పెరిగింది. మనం చేసింది మనకి రివర్సవడం అంటే ఇదేనేమో.

Anchor Srimukhi was shocked with director Maruthi dialogues. In Gentleman audio function anchor asking what is your romance experience. Then director gave counter to anchor.