ఎన్టీఆర్‌ గురించి బాబు మాట్లాడటమా?

29 May 2016


ఎన్టీఆర్ మహాను భావుడన్న విషయం అందరికీ తెలుసని, అయితే, గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆయనను తూలనాడిన చంద్రబాబు ఇప్పుడు మహానాడులో మాత్రం ఎన్టీఆర్ గురించి చెప్పడమే విడ్డూరంగా ఉందని వైసిపి సీని యర్ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. హైద రాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాల యంలో ఇతర సీనియర్ నేతలు బొత్స సత్యనారా యణ, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రెండేళ్ల పాలన గురించి చెప్పుకోవడానికి ఆయనకు ఏమీ లేదని, అందుకే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చెప్పి ప్రజలను భ్రమల్లోకి నెట్టేస్తున్నారని అన్నారు. మహానాడులో ప్రజల సమస్యల గురించి ఏమైనా చర్చించారా అని ప్రశ్నించారు. 

రెండేళ్ల పాలనలో చంద్రబాబు అవి నీతిని వ్యవస్థీకరించారని, రాజ్యాంగ విరుద్ధమైన కిరికిరి కమిటీలు వేసి ప్రజలను బాధ పెడుతున్నారని అన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి పోలవరం ప్రాజె క్టును పక్కన పెట్టి పట్టిసీమను పట్టుకున్నారని విమర్శించారు. ఐదు నెలలుగా ఆరోగ్యశ్రీ డబ్బులు అందడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా లేదని అన్నారు. ఆసుపత్రులలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని పట్టించుకోవాల్సింది పోయి ఎమ్మెల్యేలను కొను గోలు చేయాలనే ఆలోచన దుర్మార్గమని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. నదు లను అనుసంధానం చేశానంటున్న చంద్రబాబును చూసి ఇరిగేషన్ నిపు ణులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులు మళ్లీ వడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి కల్పించినది చంద్రబాబేనని ధర్మాన విమర్శించారు.


YSRCP leader Dharmana Prasadrao fired on Chandrababu Naidu. NTR is great leader, but Chandrababu is cheated him, but now in Mahanadu he is talking about him.