ప్రియాంక, దీపికా ఇద్దరిలో ఎవరు..?

13 May 2016


నెక్స్ట్ జేమ్స్ బాండ్ మూవీ ఎప్పుడు వస్తుందో తెలీదు కానీ, బాండ్ గాళ్ గా ఎవరు నటిస్తారనే విషయం మాత్రం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్లో ఈసారి మన ప్రియాంక చోప్రా కానీ, దీపికా పడుకునే కానీ ఎంపికయ్యే ఛాన్సులెక్కువ ఉన్నాయట. దీంతో వీరిద్దరిలో ఎవరు బాండ్ గాళ్ అవుతారనే అంశం  ఆసక్తి కలిగిస్తోంది. ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే ఇప్పుడో అరుదైన అవకాశం కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరికి ఇద్దరూ అందగత్తెలే, ఏ కాస్ట్యూమ్స్ లోనైనా యూత్ కి కిర్రాక్ ఎక్కించగలరు టూపీస్ అయినా, శారీ అయినా, రఫ్ అండ్ టఫ్ గా అయినా ఆడియెన్స్ కి కనువిందు చేయడంలో ఈ ఇద్దరూ  ఎవరికి వారే సాటి.

లాస్ట్ వీక్ ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే ఇద్దరూ బాండ్ గాళ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ చేశారట. ఇప్పుడీ న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిగ్గా మారింది. ఈ ఇద్దరూ ఇప్పటికే యూఎస్ లోనే ఉన్నారు. ప్రియాంక చోప్రా అయితే గత ఏడాది కాలంగా హాలీవుడ్ లోనే మకాం పెట్టేసింది. క్వాంటికో, బేవాచ్ తో బిజిబిజీగా ఉంటూనే ప్రియాంక ఆస్కార్ ఫంక్షన్లో మెరిసింది, తర్వాత ఒబామా డిన్నర్ కీ హాజరైంది. ఎక్కడకు వెళ్లినా తన స్టైల్ మిస్ కాకుండా, ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ తెచ్చుకుని గ్లోబల్ గాళ్ గా మారింది.
ఇక దీపికా పడుకునే విషయానికి వస్తే ప్రస్తుతం ట్రిపుల్ ఎక్స్ మూవీలో చేస్తోంది. స్లిమ్ గా ఫిట్ గా కన్పించే దీపికా ఈ మూవీ కోసం వర్కౌట్లు కూడా చేసింది. అందుకే ఈ ఇద్దరూ ఇప్పుడు బాండ్ గాళ్ క్యారెక్టర్ కోసం తమని అప్రోచ్ అవగా, ఓకే చెప్పారట ఇద్దరిలో ఎవరిని వరిస్తుందో తెలీదు కానీ, ఆ ఛాన్సే వస్తే కెరీర్లో అదో పెద్ద  అచ్చీవ్ మెంట్ గా మారుతుంది. బాండ్ గాళ్స్ గా ఇప్పటిదాకా అలరించినవారిని చూస్తే, అందరూ ఇంగ్లీష్ బ్యూటీలే ఎక్కువ. సౌత్ కి సంబంధించిన అందగత్తెలు దాదాపుగా లేరు. బాండ్ గాళ్ గా కన్పించాలంటే బాడీ షేపులు కూడా వేరే ఉంటాయ్, ఉందా లేదా అన్నట్లుండే నడుముతో పాటు, ఫ్రీగా అందాలు ఆరబోయడం, ఫైట్లు చేయడం బాండ్ హీరోయిన్ల స్పెషాల్టీ.

ప్రియాంకచోప్రా, దీపికా పడుకునే ఫిగర్ల విషయానికి వస్తే బాండ్ గాళ్ గా దీపికానే ఫిట్ అవుతుందనుకున్నా, ఇప్పుడు గ్లోబల్ హీరోయిన్ గా ప్రియాంక చోప్రాకి ఉన్న ఇమేజ్ కొట్టిపారేయలేనిది. ఐతే ఈ ఇద్దరిలో ఎవరు ఎంపికైనా, బాండ్ ప్రొడ్యూసర్ల అసలు దృష్టి మన దేశానికి ఉన్న మార్కెట్ పైనే అని చెప్పాలి. ఎందుకంటే సౌత్ అందగత్తెల బ్రాండ్ తో బోలెడంత బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు. దాంతో పాటు ఇఁడియా, నేపాల్, మలేషియా, సింగపూర్, థాయ్ లాండ్ తో పాటు యూఎస్ ,యూకేలో భారీ సంఖ్యలో ఉన్న ఇండియన్ సంతతిపై ఈ ప్రభావం చాలా ఎక్కువ, దాంతో ఓపెనింగ్స్ అదిరిపోతాయ్. అందుకే బాండ్ ప్రొడ్యూసర్లు ఇండియన్ హీరోయిన్లను బాండ్ గాళ్ గా చూపించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారంటారు.

Bollywood heroins Priyanka and Deepika are now doing in Hollywood. From last few days they are living in America. Now they both attended for Bond girl additions. Now they both are waiting for result.