దాసరికి అంత ఆత్రం దేనికి?

3 May 2016


దాసరి నారాయణరావ్ కి ఏదొచ్చినా పట్టలేమంటారు, ఆయనగారు ఈమధ్య అదేపనిగా పవన్ భజన చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత పవన్ కి మాత్రమే ఓ స్టైల్ ఉందంటూ మోసేశారు. దానికి పవన్ కూడా బాగానే రివర్స్ భజన చేశాడప్పట్లో. అసలు దాసరి గారిలాంటి డైరక్టర్ ఇంకోరుండరన్నారు. ఆయనతో సినిమా చేస్తున్నా అంటూ ఆఫరిచ్చేశాడు. ఐతే అదిప్పుడల్లా అవదనుకోండి, ఐనా కానీ మరో ఎర్రబస్సో, లేక పరమవీరచక్రో అవుద్ది అంతే.

ఇప్పుడు సందర్భం లేకపోయినా, తిరిగి అదే కామెంట్ చేశాడాయన. పవన్ కి మాత్రమే స్టైలున్నట్లు మాట్లాడితే జర్నలిస్టులు కృష్ణ, బాలకృష్ణ గురించి గుర్తు చేశారు. దాంతో యాయనకి ఏం మాట్లాడుతున్నాడో ఆర్దమైనట్లుంది. అదే ఎవరి స్టైల్ వారిదంటూ బిల్డప్ ఇస్తూ కవర్ చేసుకోబోయారు. చిరంజీవి నా చుట్టం నాకూ ఆయనకి తగాదా పెట్టొద్దు అంటూ నంగి మాటలు మాట్లాడారు, అసలు చిరంజీవికి అయనకి ఎందుకు పడదో పడుతుందో చెప్పాలి.

అది వదిలేసి, ఎప్పటికప్పుడు ఏదో ఉన్నట్లు బిల్డప్ ఇస్తూ కవర్ చేసుకోవడం ఎందుకు. పవన్ ని ఇలా భజన వేయడం వెనుక ఆయనేదో పార్టీ పెడితే లాభపడాలనే, అందులోనూ కులం కార్డు ఇక్కడ బాగా గీక్కోవడానికి పనికి వస్తుందని కొంతమంది అంటున్నారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి ముందు ఉన్నారు, తర్వాతా ఉన్నారు. అలానే పవన్ కల్యాణ్ కూడా అంతేగానీ ఆయనొక్కడే ఏదో గెలికేస్తున్నాడనుకోవడం భ్రమ ఇది దాసరి గుర్తించాలని మిగిలిన హీరోల ఫ్యాన్స్ వార్నింగిస్తున్నారు.

Present Dasari Nadasari Narayana Rao becoming hot topic in news. He always commenting on Mega Family. Now He is praising Pavan Kalyan, he is saying Pavan is biggest hero. But rumor is he is starting a party, so he is trying to attract Pavan Kalyan.