కాస్త ఉపశమనం

20 May 2016


పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి జయకేతనం ఎగరేసింది. 16 స్థానాల్లో విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. గత పదిహేనళ్ల నుంచి అధికారం చేపట్టిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ కు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఫలితం కాస్త ఉపశమనం కలిగించింది. కాంగ్రెస్, డీఎంకే కూటమి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాయి. పుదుచ్చేరిలో మొత్తం 30 సీట్లు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కూటమి సంపూర్ణ మెజార్టీ సాధించింది.

గత పదిహేనేళ్ల నుంచి పుదుచ్చేరిని ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలిస్తోంది. రంగస్వామి సీఎంగా కొనసాగుతూ వస్తోన్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ పై వ్యతిరేకతను కాంగ్రెస్ కూటమి అనుకూలంగా మలుచుకొంది. దీంతో దశాబ్ధన్నర నుంచి రంగస్వామి చేతుల్లో ఉన్న పుదుచ్చేరిని హస్తం పార్టీ కైవసం చేసుకుంది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమతమవుతోంది..తమిళనాడులో ఘనవిజయం సాధించిన జయపార్టీ ఇక్కడ ప్రభావం చూపలేకపోవడం గమనార్హం..

ఎండ్ వాయిస్: మిగతా రాష్ట్రాల్లో హస్తానికి వ్యతిరేక పవనాలు వీయగా  పుదుచ్చేరిలో విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయాల్లో సంబరాలు అంబరాన్నాంటాయి. రంగులు చల్లుకుంటూ, డ్యాన్స్ లేస్తూ ఉత్సాహంగా గడిపారు.

It is really good new to Congress. In Pudhucherry it is going to form Government. Out of thirty it won 16 seats.