ప్రమాణంతో పాటు ఇదీ చేయండి

27 May 2016


వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెస్ తన  ఎమ్మెల్యేలకు భలే ట్విస్టిచ్చింది. పార్టీ తరపున గెలిచి ఫిరాయించరని గ్యారంటీ ఏముందని, అంటూ ఓ అఫడవిట్ తీసుకుంది. మారబోమని పేర్కొంటూ 100 రూపాయల స్టాంప్ పేపర్లపై రాసి తీసుకుంది. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ లో ఓడిపోయినా, 45మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ తరపున అలా గెలవడమే ఇప్పుడు పార్టీకి చిక్కులు తెచ్చింది. జంప్ జిలానీల సీజన్ కావడంతో పార్టీ మారతారేమో అనే డౌట్ తో ఇలా చేసింది పార్టీ.

గెలిచిన 45 మంది ఎమ్మెల్యేలంతా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి మారిపోతారనే భయం పట్టుకుంది. దీంతో ఫిరాయింపులను తట్టుకునేందుకు ఏదోటి చేయాలని డిసైడైంది. అందులో భాగంగానే ఇలా స్టాంపు పేపర్లపై అఫడవిట్ ప్లానేసింది. అంతే కాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు విధేయులుగా ఉంటామని కూడా రాయాల్సిందిగా పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ చౌదరి నుంచి ఆదేశాలు వెళ్లాయ్.

Congress party taken a good decision about party changing MLAs. Sonia Gandhi passed rule to MLAs to write an affidavit on stamp paper for not to change party.