ఇక పద్ధతైన హీరోయిన్ల ట్రెండ్ కి అంగీకరిస్తారా..?

24 May 2016


విత్తు ముందు చెట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా లాంటి సందేహం ఎక్స్ పోజింగ్ జనం కోరుకుంటున్నారా, లేక సినిమావాళ్లే రుద్దుతున్నారా అనేది. ఈ టాపిక్ ఎందుకంటే, నీహారిక ఎంట్రీ గురించి మెగా ఫ్యామిలీ అంతా భావోద్వేగంతో ఆడియో ఫంక్షన్లో ప్రసంగించింది కాబట్టి, నిజంగా వాళ్లంతా గొప్ప సాహసమే చేస్తున్నారు. ముఖ్యంగా తండ్రి నాగేంద్రబాబు కళ్లలో తడి కూడా కన్పించింది. కానీ అంత ఎమోషనల్ అవడానికి కారణమేంటి..? తెలుగు సినిమాల్లో హీరోయిన్లు ఒకప్పుడు పద్దతిగానే ఉండేవారు, మళయాళం అంటే వెంటనే జాకెట్ లేని స్త్రీ క్యారెక్టర్లు, మరో కేటగరీ సినిమాలు ఉండేవి. ఐతే ఇది రివర్సై ఒకప్పుడు వ్యాంప్, క్లబ్  డ్యాన్సర్లు వేసే బట్టలు తెలుగు కథానాయికలకు అంటగట్టి, ప్రతి అంగం ఎంతెంత సైజులో ఉందీ కన్పించేలా విపరీతమైన శ్రధ్ద పెట్టి మరీ జనంపైకి వదిలారు. పైగా జనం అది లేకపోతే, చూడరంటూ ఓ ఫార్ములా కూడా రాసేసుకున్నారు. 

అలా ఉంటేనే చూస్తారంటూ ఇప్పటికీ వాదించే వాళ్లున్నారు. వాళ్లందరికీ ఓ సమాధానం సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు. ఇప్పుడు బ్రహ్మోత్సవం సరే ఈ టాపిక్ ఇక్కడ ఆపి, మళ్లీ మెగా కాంపౌండ్ కి వద్దాం. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగేంద్రబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇంతమంది హీరోలున్నారు. వీరంతా వారి హీరోయిన్లతో చేసే చేష్టలు ఓ సారి చూడండి, అలానే పాటల్లో ఆ క్యాస్టూమ్స్ కూడా గమనించండి. ఖచ్చితంగా బ్రెస్ట్ స్ట్రోక్స్, బొడ్డు కింద డ్రస్సు, ఆ డ్రస్సు దగ్గర తలో, చేయో, కాలో పెట్టి ఏదో ఆడియెన్స్ కి కన్నుకొట్టే ఫోజులు, హీరోలు మారినా ఈ ఫోజులు మాత్రం మారవ్. ఇక్కడ వీళ్లగురించే ఎందుకంటే వీళ్ల అమ్మాయే హీరోయిన్ అయింది, కాబట్టి పైగా దాన్ని మొదట్లో వాళ్లు కాస్త వ్యతిరేకించామని వాళ్లే చెప్పారు కాబట్టి. వీళ్ల అమ్మాయి కాబట్టి, ఇలా చేసారంటున్నారు కానీ, వాళ్ల సినిమాల్లో హీరోయిన్ల గురించే ఈ జాగ్రత్త తీసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీల గౌరవం పెరిగి ఉండేది కదా. 

ఈ ప్రశ్న ఒక్క మెగా ఫ్యామిలీకేకాదు, అందరు హీరోలకు వర్తిస్తుంది. అందరు హీరోలు తమ కుటుంబంలోని మహిళలపట్ల అనేక జాగ్రత్తలు తీసుకుంటారు, మరీ శ్రధ్ద ఇతరులపైనా చూపిస్తే, ఇండస్ట్రీలోకి సాధారణ జనానికి సంబంధించిన అమ్మాయిలు కూడా వస్తారు కదా. వాళ్ల ఎంట్రీ గురించి ఇంత బాధపడాల్సిన అవసరమే లేదు కదా! అందుకే అప్పుడు సూపర్ స్టార్ కూతురు మంజుల ఎంట్రీకి కూడా ఇలానే ప్యాన్స్ అడ్డం తిరిగారు. ఇప్పుడు సిచ్యుయేషన్ కాస్త మారింది, మరి నీహారిక మిగిలిన హీరోయిన్లలా సినిమా జనం చెప్పేలా (సగం సగం క్యాస్టూమ్స్ తో) చేయగలదా..? ఈ ఐటెమ్ రచయితకి అలా చేయాలనే కోరికేం లేదు, కనీసం ఈ పరిణామంతో అయినా తెలుగు సినిమాల్లో వస్త్రధారణ పధ్దతి మారుతుందని కోరిక మాత్రమే. బయట జనం కనీసం ఊహించను కూడా ఊహించలేని క్యాస్ట్యూమ్స్ లో హీరోయిన్, వ్యాంప్ లను నటింపజేస్తూ, అదే జనం కోరుతున్నారని చెప్పే దర్శకనిర్మాతలకోసమే ఈ స్టోరీ, దానికి నీహారిక తెరంగ్రేటం ఓ ఆధారం మాత్రమే..

Mega heroin Niharika did a movie with young hero Niharika. In this movie her dress code and acting is very traditional. But heroins in Mega family heroes movies are very hot. What is the difference.