జగన్ ది జలదీక్ష-చంద్రబాబుది ధనదీక్ష

20 May 2016


జనం కోసం, జలం కోసం జగనన్న దీక్ష చేస్తుంటే ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దన దీక్ష చేస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు.కర్నూలులో జరిగిన జగన్ జలదీక్షలో ఆయన ప్రసంగించారు. ఇరవైఆరుసార్లు జగన్ ఇంతవరకు దీక్ష చేశారని,డాక్టర్లు హెచ్చరించినా, జనం కోసం జగన్ దీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం సూదితో మేల్కోదని,గడ్డపారతో లేపవలసిన పరిస్థితి ఉందని చెవిరెడ్డి అన్నారు.తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు పూర్తి అయితే రాయలసీమకు నీరు వచ్చే అవకాశం ఉండదని అన్నారు. 

శ్రీశైలం లో 854 అడుగుల మట్టానికి నీరు వస్తేనే రాయలసీమకు నీరు వస్తుందని, ఆ మట్టం దాటితేనే సాగర్ కు నీరు వస్తుందని ,కాని ఈ లోగానే 820 అడుగులకు చేరుకోగానే తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక మోటార్లతో నీరు తోడేస్తే కిందకు నీరు ఎలా వస్తాయని ఆయన అన్నారు.గోదావరిలో కూడా 500 టి.ఎమ్.సిల నీటిని వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా, ఎందుకు ఎపి ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని ఆయన అన్నారు.కర్నాటక ఇప్పటికే ఆలమట్టి ఎత్తు పెంచుతామని అంటోందని , అది జరిగితే రాయలసీమ పరిస్థితి ఏమిటని అన్నారు.

YS-Jagan is doing Jala Deeksha for Rayalaseema people to give water to them. But TDP leaders and Chandrababu Naidu is trying to disturb the Deeksha.