కాపు భవన్లకి చంద్రబాబు పేరా..?

23 May 2016


ప్రస్తుతం ఏపి సిఎం చంద్రబాబునాయుడు పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపుసంఘాల భవన్లకి పెట్టడంపై వివాదం రగులుకుంటోంది. ఇక్కడ విన్పించే విమర్శల్లో అసలు బతికి ఉన్న నేతలు ఎవరైనా ఏదైనా పథకాలకు కానీ, స్కీములకు కానీ తమ పేర్లు పెట్టుకున్న దాఖలాలు లేవు. అసలలా పెట్టడం హిందూ సంప్రదాయం కాదు కూడా. ఇలాంటి సమయంలో ఏపి సిఎం చంద్రబాబు పేరు ఓ కులసంఘాల భవంతులకు పెట్టడం ఎలా సమర్ధించుకుంటారో చూడాలి. ఇది కేవలం ప్రభుత్వ దుర్వినియోగమే అవుతుంది.

కాపులకు బడ్జెట్ కేటాయించడం కానీ, నిధుల మంజూరు కానీ ప్రభుత్వం తరపునే జరుగుతుంది. మరి అప్పుడు చంద్రబాబు పేరు ఎలా పెడతారు, అలాగైతే ఇక రాబోయే రోజుల్లో మంత్రుల పేర్లు కూడా వాళ్ల వాళ్ల శాఖల్లోని పథకాలకు పెట్టుకుంటారా, చంద్రబాబునాయుడు దేశ్ కి నేతా ఏం కాదు, పైగా కాపు కులస్థుడు కాదు అలాంటప్పుడు ఈ ఇష్యూని ఎలా జస్టిఫికేషన్ చేస్తారో చూడాలి. పైగా ఆ పార్టీ కి చెందిన విప్ బొండా ఉమా అడ్డంగా ఎందుకు పెట్టకూడదు అని అడ్డంగా వాదిస్తాడు. బతికున్న వారి పేర్లు ఏవైనా స్కీములకు పెట్టడం టిడిపి నేతలకు కామన్ కూడా, ఎందుకంటే ఏపీ స్పీకర్ కోడెల పేరుతో ఆయన నియోజకవర్గంలో రోడ్లు, సిమెంట్ రోడ్లు వెలిశాయ్ కూడా. ఇది ఆయన స్పీకర్ కాకముందే జరిగింది, అలానే నరసరావుపేటలోని పలు భవంతులకు కూడా ఆయన పేరు పెట్టారంటారు. 

ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన చేసిన పనులకు గుర్తింపుగా అభిమానం ఉన్నవారో, లేక ప్రభుత్వమో వారి పేర్లు పెడుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కొన్ని గొప్ప గొప్ప పథకాలకు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ పేర్లు పెట్టారు. వారు కాంగ్రెస్ నేతలనే కాదు, దేశానికే దిశానిర్దేశం చేసి, ప్రగతిపథంలో నడిచేందుకు ఓ పంథా నిర్దేశించినవారు. మరిప్పుడు చంద్రబాబు అండ్ కో గతంలో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలపై (ఇందిరమ్మ టాయిలెట్లు కూడా పెట్టండని చేశారు) కామెంట్ చేసినట్లు, చంద్రబాబు బహిర్భూమి పథకాలని ప్రతిపక్షాలు కామెంట్ చేస్తే, ఎలా తిప్పికొట్టే అర్హత ఉంటుందో చెప్పాలి.

AP government is named Kapu bhavan as Chandrababu Bhavan. It was hot topic in media and opponent parties.