హవ్వ ఇవేం మాటలు బాబూ

27 May 2016


చంద్రబాబు గారు వయస్సు ఎక్కువయ్యే కొద్దీ గ్రిప్ కోల్పోతున్నారని ఈ మధ్యకాలంలో టాక్ ఉంది. అది నిజమే అని ఇప్పుడు మరోసారి ప్రూవైంది. దేవుడి భక్తి పెరగడం వల్ల ఆదాయం పెరిగిందని. ఎక్సైజ్ రెవెన్యూ తగ్గిందని అనడం ఎలా సమర్ధించుకుంటారు. ఇది కేవలం నాన్సెన్స్, వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా ఉండొచ్చు, కానీ చంద్రబాబులాంటి అనుభవజ్ఞుడు, ముఖ్యమంత్రి పదవిలో ఉండి కలెక్టర్ల సదస్సులో ఇలా మాట్లాడటం ఎలా సబబో ఆయన, ఆయన వంధిమాగధులు పార్టీ కేడర్ సమాధానం చెప్పుకోవాలి. పైగా ఆదాయం పెరిగిన దేవాదాయ శాఖను కూడా అవమానపరచడం, అధికారులు పెద్దగా పనిచేయకపోయినా, 27 శాతం రెవెన్యూ పెరిగిందనడం ఆ శాఖ సిబ్బందిని ఖచ్చితంగా అవమానించడమే. 

మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, సిబ్బందిలో చంద్రబాబుపై అసహనం కాకపోతే అభిమానం  ఎలా పెరుగుతుంది. తప్పులు చేసే జనం దాన్ని పోగొట్టుకోవడానికే గుళ్లలో హుండీల్లో డబ్బులు వేస్తున్నారనడం కరెక్టేనా, ఇదే మాట తిరుమల దేవుడి విషయంలో అన్వయిస్తే దాన్ని సమర్ధించుకోవడం జరిగే పనేనా..? మనం తప్పులు చేశామని, అది అందరికీ అన్వయించడం కరెక్ట్  కాదు. ఇప్పటికీ ఏ తప్పులూ చేయని వారు చాలామందే ఉన్నారు, తెలియక జరిగే తప్పులు తప్పులే కావు బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడినా దానికి ప్రచారం ఎక్కువ. మరి ఇది తెలిసీ చంద్రబాబు ఎందుకు ఇలా మాట్లాడారు, చెప్పగలరా తెలుగు తమ్ముళ్లూ?

AP CM Chandrababu comments are creating funny. In collectors meeting his comment about departments and its incomes are declared that Chandrababu has lost his sense.