నిస్సిగ్గుకి నిదర్శనమీ మాటలు

31 May 2016


చంద్రబాబునాయుడు చేస్తున్న రాజకీయ వ్యభిచారానికి నిదర్శనంగా మారనున్నాయ్, రాజ్యసభ ఎన్నికలు. తాను మాత్రం కేసులున్న మంత్రులకు తిరిగి టిక్కెట్లు ఇవ్వొచ్చట, విజయసాయిరెడ్డికి ఇస్తుందో, ఇంకొకరికి ఇస్తుందో అది వైసీపీ ఇష్టం, అంతేకానీ టిడిపి చెప్పినట్లో, వారి తాబేదార్లు అడిగారనో టిక్కెట్లు ఎవరూ పంచిపెట్టరు. అది తెలిసి కూడా విజయసాయిరెడ్డి అభ్యర్ధిత్వంపై అవాకులు చెవాకులు ఎందుకు పేలుతున్నారో తెలీనంత సన్నాసులు ఎవరూ లేరని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.

నీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ఆయన మంత్రి సుజనాచౌదరిపై ఉన్న కేసు గురించి అడిగితే మాత్రం మండిపడతారు, అసలు మరో అభ్యర్ధి టిజి వెంకటేష్ ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు. ఆయన ఫ్యాక్టరీ వెదజల్లే కాలుష్యంపై కర్నూలు వాసులు హైదరాబాద్ లో 1100 వాహనాల్లో ర్యాలీ చేస్తున్నా, ఒక్క న్యూస్ కూడా టీవీ ఛానళ్లలో రానీయకుండా డబ్బులు వెదజల్లిన ఘనుడు. కర్నూలు లో కేబుల్ నెట్ వర్క ్ఆయన చేతిలో ఉంది కాబట్టి, ఈ ఛానళ్లు ఆయనకి వ్యతిరేకంగా ఒక్క వార్తా రానీయవు. అలాంటి మనిషిని చాలా రోజుల్నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మంత్రిగా చేశారు, అంటూ అందరికీ తెలిసిన కబుర్లు చెప్పడంలో చంద్రబాబును మించినోళ్లు లేరు.

పైగా సురేష్ ప్రభుకి మరో సీటు కేటాయించడమేంటో తెలీదు, ఆయనగారు తెలుగు రాష్ట్రాలకు పెట్టిన బొక్క చాలదని, మళ్లీ మరో టర్మ్ ఎందుకు ఛాన్సిస్తారో తెలీదు. పైగా నాలుగో సీటు కి కాండిడేట్ ని నిలబెట్టడంపై డైరక్ట్ గా చెప్పకుండా, వచ్చే జంప్ జిలానీలే డిసైడ్ చేస్తారన్నట్లు మాట్లాడటం నిస్సిగ్గుకి నిదర్శనం.

AP opponent party YSRCP decided to elect Vijay Sai reddy as Rajyasabha memeber. But Chandrababu Naidu comments about this is very foolish.