బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ

24 May 2016


యాజిటీజ్ గా చంద్రబాబు అండ్ కో ఇదే చేస్తుంది. ఇదే ప్రూవైందివాళ, జపాన్ టీమ్ ఒకటి ఏపీ సెక్రటరియేట్ కి వస్తుందని, అంతా అబ్జర్వ్ చేసి ఏదో చేసేస్తారనే హడావుడి రెండు ఛానళ్లు చేశాయ్. కానీ ఆ టీమ్ వచ్చింది వెళ్లింది, అక్కడున్నది ఎంత సేపో తెలుసా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇలా బస్ దిగి, అలా వెళ్లి మళ్లీ బస్సెక్కి జంపయ్యారు. ఐతే జపాన్ టీమ్ లో చాలామంది బస్ కూడా దిగకుండానే లోపలే టైమ్ పాస్ చేశారు. 

ఇది చూసి కూడా ఆ రెండు ఛానళ్లు ఓ తెగ టీమంతా తిరిగేస్తున్నారని బ్రేకింగు లేసుకున్నాయ్. ఐనా ఊరికినే ఓ అరగంట కలియతిరిగిన తర్వాత వాళ్లేం చెప్తారో రాసుకుందామనే తాపత్రయం ఎందుకు? చాలా ఫాస్ట్ గా సెక్రటరియట్ పూర్తవుతుందని, మాట్లాడితే చంద్రబాబు ప్రభుత్వానికి కితాబులిచ్చారని చెప్పుకోవడానికేనా..! ఐతే వాళ్ల ఉత్సాహంపై జైకా బృందం నీళ్లు చల్లిందనే చెప్పాలి. దీంతో షాక్ తిన్న ఏపీ సర్కారు బాకా మైకులు లోగోలు మడిచేసి, టీమ్ వచ్చివెళ్లిందంటూ బ్రేకింగులతో సంతృప్తి పడ్డారు. నిజంగా వాళ్లే వచ్చి మాట్లాడి ఉంటే సాయంత్రం వరకూ హడావుడి చేసేవే..!

Chandrababu Naidu and his team doing over action in AP Capital matter. Today Japan team is coming to visit Secretariat, CM and his media doing over announcement about this, but came and went with in two minutes.