విదేశాలకు చంద్రబాబు దాసోహం..స్వరాజ్యం స్వాహా..?

18 May 2016


ఏపి సిఎం చంద్రబాబుకు సొంతవనరులపై నమ్మకం ఉండదంటారు. ప్రతి అంశానికి ఫారిన్ ముద్ర వేస్తేనే కానీ ఆయనకు తృప్తిగా ఉండదట, అందుకే ప్రతి ఇష్యూలో ఫారిన్ దేశాలనుంచి అదొస్తుంది, ఇదొస్తుంది అని గొప్పలు చెప్తూ తానేదో ఊడబొడిచినట్లు చెప్పుకుంటుంటారని ఆరోపణలున్నాయ్. అలాంటి వాటిలో ఇప్పుడు ది గ్రేట్ స్వరాజ్ మైదాన్ కూడా చేరబోతోంది. ఏడు ఎకరాల్లో ఉన్న పిడబ్ల్యూడీ గ్రౌండ్స్ ని చైనా దేశానికి చెందిన కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఎవరూ అడ్డుకోకపోతే, త్వరలోనే వాళ్లకి హస్తగతమైపోతుంది కూడా. ఇప్పటికే స్థానికులు ప్రజాసంఘాలుగా ఏర్పడి అనేకసార్లు జిల్లా కలెక్టర్ కి చంద్రబాబుకి వినతిపత్రాలు ఇచ్చిన ప్రయోజనం శూన్యం క్యాంప్ ఆఫీస్ కి దగ్గరగా ఉన్న ఈ గ్రౌండ్స్ లో కొన్ని బిల్డింగ్స్ ను రెండేళ్ల కిందట రిపేర్లు కూడా చేయించారు. ఐతే విదేశీమోజుతో చంద్రబాబు ఓ పెద్ద ఫంక్షన్ హాల్ కట్టబెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయ్.

స్వరాజ్య మైదానానికి చాలా గొప్ప చరిత్రే ఉంది. ఇక్కడే స్వాతంత్ర ఉద్యమ సమయంలో గొప్ప గొప్ప నేతలు వచ్చి తన ప్రసంగాలు ఇచ్చి వెళ్లారు. ఇవేవీ పట్టని చంద్రబాబు అండ్ కో కేవలం రియల్ రేట్లని దృష్టిలో పెట్టుకుని చైనాకి అప్పగించే పనిలో పడింది. వెయ్యికోట్ల విలువైన ఈ ఏడుఎకరాలు అవసరం అనుకుంటే ప్రభుత్వమే ఇంకా డెవలప్ చేయొచ్చు కానీ, ఇలా పరాయిదేశంవారి కంపెనీకి కట్టబెట్టాలని ఎందుకు అనుకుంటుందో అందులోని మతలబేంటో వారికే తెలియాలి.

AP CM Chandrababu Naidu always saying about foreign countries. Present he is preparing to give PWD ground to Chaina company.