ప్రత్యేక హోదా వేస్ట్ అట..

18 May 2016


ఏపి సిఎం చంద్రబాబు తనకి తాను ఓ పెద్ద మెజీషియన్ అనో, లేదంటే హిప్నాటిస్ట్ అనో అనుకుంటూ ఉండొచ్చు. లేదంటే వినేవాడు వెంగళాయి అయితే చెప్పేవాడు చంద్రబాబవుతాడని ఇప్పటికే మన జనం చాలా మంది అనుకుంటుంటారు. సరదాగా ఢిల్లీ వెళ్లి ప్రదానమంత్రితో భేటీ అయి, అడగాల్సినవి అన్నీ అడిగి వచ్చా అని చెప్పిన తర్వాత కూడా ఇంకా తన పాట తాను పాడతానే ఉంటారాయన. "అస్సలు హోదాతో ఏం వస్తుంది, హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయ్, హోదా ఇచ్చి డబ్బులి వ్వకపోతే పరిస్థితి ఏంటి.." ఇలా సాగింది ఆయన ధోరణి. ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్తుండంటంతో ఇక ఆయన కూడా అదే పాట పాడి పాడి, జనాలకు అలవాటు చేద్దామని అనుకుంటున్నట్లున్నారు. పైగా హిప్నాటిస్ట్, మినీ చాణక్యుడని ఆయన వంధిమాగధులు ఎటూ మోస్తుంటారు కాబట్టి ఆయనేం చెప్పినా చెల్లుతుందని ఆయన ఫీలింగ్ కాబోలు.

స్పెషల్ స్టేటస్ తో ఏమీ ఒరిగేది లేదని రెండేళ్లలోనే చంద్రబాబుకి తెలిస్తే, అంత చాణక్యుడు మరో దేవదూత మోడీ ఎన్నికలకు ముందు ఎందుకు ఆ హోదా అంశాన్ని అన్ని చోట్లా ప్రస్తావించారు..? అది కూడా తమవల్లనే సాధ్యమవుతుందని ఎందుకు ఢంకా భజాయించారు, వీరిద్దరి తోక పవన్ కల్యాణ్ ఎందుకు కాంగ్రెస్ హఠావో అంటూ నినాదాలు చేసి పెద్ద పోజులిచ్చారు, ఇప్పుడెందుకు నోరు మాగవోతుంది. అక్కడికేదో ఇప్పుడు నిధులు తెగ వరదలా పారుతుంటే, హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏంటి అనడగవచ్చు. అదీ లేక ఇదీ లేక ఎందుకు బాబూ నువ్ పదవిలో ఉండటం...? స్పెషల్ స్టేటస్ ఇస్తే ఖచ్చితంగా ఇఁడస్ట్ర్లీలు వస్తాయి. ప్రతి జిల్లా ఓ హైదరాబాద్ అవుతుందని చెప్పే మాట చంద్రబాబుకి తెలీదా, తెలిసీ తెలీనట్లు బిల్డప్ ఇస్తున్నారా...?

Chandrababu Naidu is always changing his talks. Form the date state division he is saying only we can get special status to AP. But present he is saying what is the use of special status.