బాబ్రి లో దీక్ష చేశావు,తెలంగాణకు వెళ్లవే బాబూ

20 May 2016


ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను మబ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ప్రజలు తమ సమస్యలు తీర్చమంటే సింగపూర్ లో నలభై అంతస్తుల భవనాలు,దుబాయిలో 150 అంతస్తుల భవనాలు ఉన్నాయని, అలాగే ఇక్కడ కూడా భవనాలు నిర్మిస్తామని చెబుతు ప్రజలను ఆశలపల్లకిలో ఊరేగించి తన పబ్బం గడుపుకోచూస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో నీ బలం చాలకపోతే ,తాము కూడా సహకరిస్తామని, కేంద్రానికి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని కోరినా అందుకు సిద్దపడడం లేదని ఉమ్మారెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాప్యం చేస్తూ పట్టిసీమ పేరుతో వందల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారని అన్నారు.

మూడేళ్ల కోసం మాత్రమే పట్టిసీమ అన్నారని, అంటే ఆ తర్వాత ఉపయోగం లేదని చెప్పడమే కదా అని ఆయన అన్నారు.గతంలో మహారాష్ట్రలో బాబ్రికి వ్యతిరేకంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పోరాడనని చెప్పే చంద్రబాబు నాయుడు ,ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి మహబూబ్ నగర్ కు చంద్రబాబు ఎందుకు వెళ్లడం లేదని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.

Telangana Government is constructing illegal projects on Krishna and Godhavari rivers. But AP CM Chandrababu is not talking any thing about it.