ఫించనేది బాబూ..!

30 May 2016


ఫించనుకోసం నిలదీసిన ఒక వృధ్ధురాలిపై పోలీసులు అమానుషంగా దాడిచేసిన ఘటన మహానాడు చివరిరోజు చోటుచేసుకుంది. ము ఖ్యమంత్రి సొంత ఊరైన నారావారిపల్లికి చెం దిన పార్వతమ్మ అనే వృద్ధురాలు తనకు పింఛ ను అందడం లేదంటూ ఆదివారం మహానాడు ప్రాంగణానికి వచ్చింది. కనిపించిన నేతలందరి కి చెప్పినా నామమాత్రపు స్పందన రాకపోవడం తో ఆమె ఒక్కసారిగా ఆవేశానికి గురైంది. తీవ్ర పదజాలంతో దూషిస్తూ వేదికపైకి దూసుకు రా వడానికి ప్రయత్నించింది. 

దీంతో టిడిపి కార్య కర్తలు, మహిళా పోలీసులు చుట్టు ముట్టి బలవంతంగా బయటకు ఈడ్చుకుపోయారు. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ సంఘటనకు ముఖ్యమంత్రి కూడా షాక్‌కు గురయ్యారు. మహానాడు ప్రాంగణంలో ఉన్న మహిళాపోలీసు అధికారులు పార్వతమ్మను విచక్షణా రహితంగా చితకబాదారు. న్యాయం చేయమంటూ సొంతూరోడైన సిఎం వద్దకు వెళితే పోలీసులతో కొట్టి తరిమేసాడని ఆమె కంటతడి పెట్టుకుంది. పోలీసుల దాడిలో సొమ్మసిల్లి పడిపోయిన ఆమెను కొందరు కార్యకర్తలు బయటకు తీసుకెళ్లిపోయారు.

Chandrababu Naidu conducting Mahanadu is Tirupathi from last three days. In this Mahanadu he planing schemes. In this Mahanadu a old women trying to talk with Chandrababu for her pension. But polices stopped her.