దీక్షాదక్షుడు

18 May 2016


పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లో తలపెట్టిన ప్రాజెక్టులు అక్రమం అని ప్రతిపక్షనేత జగన్ చేసిన దీక్ష నేటితో ముగిసింది. ఈ సందర్భంగా చేవలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకంపై వైఎస్ జగన్ ప్రసంగం అక్షరాలా నిజమే అని చెప్పకతప్పదు. ఓ వైపు నీళ్లు లేక రాయలసీమ ఎడారిగా మారుతుంటే, చోద్యం చూస్తు కూర్చున్న ప్రభుత్వాన్ని తట్టి లేపాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే. ఇందులో వైఎస్ జగన్ పై అనవసరంగా టిడిపి నేతలు ఆరోపణలు చేయడం, దీక్షపై కామెంట్ చేయడం వారి కంగారును సూచిస్తుంది తప్ప వేరొకటి కాదు. చేతనైతే ప్రభుత్వంలో ఉన్నందుకు ప్రాజెక్టులను ఆపాలి, ఆ ప్రయత్నం చేయాలి లేదంటే ఆ ప్రయత్నం చేస్తున్నవారిపై కనీసం రాళ్లేయకుండా ఉండాలి.

అంతే కానీ తాను ఢిల్లీ వెళ్లి ఈ  ఇష్యూపై లెటర్ ఇచ్చానని చెప్పినంత మాత్రాన మైలేజీ రాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా వ్యవహరిస్తున్న ధోరణే చాలా అసంబద్దంగా ఉంది. తాము చేయరు, చేసేవారిపై విమర్శలు పైగా  ఇష్యూలో కేసీఆర్ జగన్ మిలాఖత్ అంటూ ముండమోపి వాగుడు ఒకటి. ఇలాంటి వ్యాఖ్యలు చేసే జనంలో పలచన అవుతున్నారు టిడిపినేతలు. ఎందుకంటే ప్రతిపక్షనేత చేస్తున్న దీక్ష, వాదనలో నిజం ఉంది. అలాంటి వాటిపై స్పందించేటప్పుడు ముందు వెనుకా చూస్కోవాలి కానీ టిడిపి నేతలకు ఆ మాత్రం వివేకం ఎక్కడ మిగిలుంది?

YS Jagan doing strike to stop project in Telangana. Chandrababu Naidu is not taking any action to stop this project. But he is commenting about Jagan and trying to stop Jagan strike.