శివాయ్ పై విమర్శలు

28 May 2016


అజయ్ దేవ్ గన్ ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయడంలేదు. క్యారెక్టర్ సెంట్రికే తప్ప, హీరో ఓరియెంటెడ్ మూవీస్ చేయడం మానేసి చాలా రోజులే అయింది. మధ్యలో వచ్చిన సింగం మినహాయింపు, ఐతే వైవిధ్యమైన సినిమాలు చేయడానికే మనోడి ప్రయార్టీ, అలా వస్తున్న సినిమానే శివాయ్. ఫస్ట్ లుక్ రిలీజవగానే ఫ్యాన్స్ ఆత్రంతో చూశారు మంచి హిట్లే పడ్డాయ్ కానీ, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని కామెంట్లు వస్తున్నాయ్. శివాకారంలో ఓ మనిషి అస్పష్టంగా కన్పిస్తుండగా, ఆయనపైకి లంఘిస్తున్నట్లుగా అజయ్ దేవ్ గన్ కన్పిస్తున్నాడు. ఇక్కడ అజయ్ దేవ్ గన్ కాళ్లకి షూ కూడా వేస్కున్నాడని ఆరోపిస్తున్నారు. 

మంచుకొండలు బ్యాక్ గ్రౌండ్ ఆ హడావుడి చూస్తుంటే, మానససరోవం యాత్ర ఆ నేపధ్యంలో సాగే కథలా అన్పించకమానదు. ఈ సినిమా అజయ్ దేవ్ గన్ సొంతంగా తీస్తుండగా, ఒకప్పటి జంట దిలీప్ కుమార్, సైరాబాను నటిస్తుండటం విశేషం. ఇన్ కార్నేషన్ ఆఫ్ శివ ..శివా ట్రయాలజీ అని మూడు పుస్తకాలు వచ్చాయ్, వాటి ఆధారంగా తెరకెక్కిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయ్. పోస్టర్లు తమకి అంగీకారం కాదంటూ ఢిల్లీ తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సినిమా రిలీజైతే కానీ అసలు విషయం తెలీదు మరి.

Bollywood hero Ajay Devagan is not doing form long time. Except Singam he has no hit moives. Now he doing movie Sivai in his own production. It first look was released recently, its hurting Hindus felling. A case was file on Ajay Devgan.