ఈశాన్యంలో కమలం

20 May 2016


15 యేళ్ల చరిత్రను తిరగరాశారు.. అసోం ప్రజలు. తొలిసారిగా బీజేపీకి పట్టం కట్టారు. ఎగ్జిట్‌  పోల్స్‌  సర్వేలు చెప్పినట్టే.. కమలానికి జై కొట్టారు. అవినీతి పాలనకు చరమగీతం పాడారు. అభివృద్ది మంత్రాన్ని గెలిపించారు. వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న తరుణ్‌  గొగోయ్‌ను.. ఇంటికి పంపించేశారు. ఎగ్జిట్‌  పోల్స్‌  సర్వేలు చెప్పినట్టే.. అసోంలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అసోం గుణపరిషత్‌, ఏజీపీ, బోడో పార్టీలతో కలిసిన కమలం.. అపురూపమైన విజయాన్ని అందుకుంది. దేశంలో.. ఓ ఈశాన్య రాష్ట్రంలో.. కమలం వికసించడం ఇదే తొలిసారి.

126 స్థానాలున్న అసోంలో.. బీజేపీ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ముఖ్యంగా 15 యేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతే.. బీజేపీ గెలుపుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వరుసగా మూడు సార్లు అధికారంలో ఉన్న తరుణ్‌   గొగోయ్‌ పై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. అంతేకాకుండా.. అసోం అభివృద్దే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ కూటమిని.. ఓటర్లు ఆదరించారు.
అసోంలో మార్పు కోసం తమనే గెలిపించాలన్న పిలుపును ఆదరించిన ఓటర్లు.. సీఎం తరుణ్‌  గొగోయ్‌ను ఇంటికి పంపించేశారు. ఎన్నికల ముంగిట.. కాంగ్రెస్‌  నుంచి హిమాన్స్‌  విశ్వాస్‌  శర్మ బీజేపీలోకి రావడం.. ఆ పార్టీకి కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇటు ఏజీపీ అధినేత ప్రఫుల్ల కుమార్‌  మహంత.. బీజేపీతో జతకట్టడం తో.. రెండు పార్టీలకు మేలు జరిగినట్లైంది.

ముఖ్యంగా కాంగ్రెస్‌  సిట్టింగ్‌  స్థానాలపైనే గురిపెట్టిన బీజేపీ కూటమి.. విజయం సాధించింది. గతం నుంచీ కాంగ్రెస్‌కున్న 47 స్థానాలను.. ఏకపక్షంగా బీజేపీ కూటమికి అప్పగించినట్లుగా అర్థం చేసుకోవచ్చు. దీంతో కాంగ్రెస్‌   ఏ స్థాయిలోనూ.. పోటీ ఇవ్వలేకోయింది. ఇటు ముస్లీం ఓట్లే ప్రధానంగా బరిలోకి దిగిన ఏఐయూడీఎఫ్‌  ఆ వర్గం ఓట్లు సాధించడంలో విజయం సాధించింది. అయితే కాంగ్రెస్‌  వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని.. ఏఐయూడీఎఫ్‌  చీఫ్‌.. బద్రద్దీన్‌  అజ్మల్‌  అన్నారు.

It is really victory to Narendra Modi. In Southern states and Asam state BJP showed its power. No of seats increased in Southern States.