ఇక్కడా జంప్ జిలానీలకు షాక్ తప్పదా?

7 May 2016


ఉత్తరాఖండ్‌ శాసనసభలో హరీశ్ రావత్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నెల 10న తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే పదో తారీఖున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఆ కొద్ది సేపు అమలు జరగదని తెలిపింది. బలపరీక్ష అంతా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. ఐతే అనర్హత వేటు పడిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ విశ్వాస పరీక్షలో ఓటు వేయడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది బిజెపితో పాటు, జంప్ జిలానీలకు షాక్ ఇచ్చింది. విశ్వాస పరీక్షను ఈ నెల 10న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని, కోర్టు చెప్పింది. సభలో విశ్వాసపరీక్ష నిర్వహించడానికి కేంద్రం అంగీకరించడంతో సుప్రీంకోర్టు ఇలా తీర్పిచ్చింది. దీంతో మే10 తర్వాత అక్కడ ఓ క్లారిటీ వస్తుంది.

ఐతే ఇదే సమయంలో జంప్ జిలానీల అనర్హత పై ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో కూడా కలకలం రేపుతోంది. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలకు వెళ్లే ముందు పార్టీ మారుతున్న ఈ  ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్ధికి ఓటేస్తే సభ్యత్వం రద్దవుతుంది. అది ఎటూ స్పీకర్ పట్టించుకోకపోయినా, కోర్టుకి వైఎస్సార్సీపీ వెళ్లడం ఖాయం. అలా తీర్పు ఇప్పుడు వచ్చింది కాబట్టి పార్టీ ఫిరాయింపుదార్లపై వేటు వేయించేందుకే జగన్ డిసైడయ్యారట. సో ఏది ఆశించి టిడిపి వీళ్లను లాక్కుంటుందో ఆ టార్గెట్ నెరవేరకపోగా, ఎమ్మెల్యే సభ్యత్వాలు రద్దయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయ్.

Really it is big shocking news to YSRCP jumped MLAs. Supreme Court gave judgement against BJP government. Shortly it will happen in Andhra Pradesh.