రికార్డ్ బ్రేకవలేదు..ఖలేజాకి ఎగ్జాంపులే..!

25 May 2016


బ్రహ్మోత్సవం ఫ్లాప్ అని చెప్పలేం కానీ, హిట్ మాత్రం కాదు. ఐతే సినిమా రిజల్ట్ సంగతి పక్కనబెడితే విడుదలై 6 రోజులవుతున్నా, ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారంటే మహేష్ క్రేజ్ కి అతనికి ఉన్న డిమాండ్ గురించి జనంలో ఉన్న ఫాలోయింగ్ కి అదే నిదర్శనం. కాంటెంపరరీ హీరోల్లో ఎవరికీ లేనంత రీచ్ మహేష్ బాబుది, బాలేదన్నా కూడా సినిమా ఎందుకు బాగోలేదని థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నారు జనం. బాహుబలి, శ్రీమంతుడు తర్వాత ఇక రికార్డులన్నీ బ్రహ్మోత్సవానికి సొంతమనే రేంజ్ లో పబ్లిసిటీ జరిగింది. ఐతే ఆ రేంజ్ కి చేరేంత సీన్ బ్రహ్మోత్సవానికి లేదని అంటున్నారు. ఐతే వసూళ్ల పరంగా తక్కువ మాత్రం కాదు.

ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా నాలుగో ప్లేస్ లో నిలవడం అంత చిన్న విషయమేం కాదు. 18కోట్లు ఒక్క రోజే కలెక్ట్ చేసిందట బ్రహ్మోత్సవం. ఇక మిగిలిన ఓవర్సీస్ కలెక్షన్స్ అన్నీ కలిపి మూడ్రోజులకు 33 కోట్ల షేర్ వసూలు చేసి షంషేర్ అన్పించుకున్నాడు. ఇలా మహేష్ ఫ్లాప్ మూవీ కూడా దిమ్మతిరిగే వసూళ్లు రాబట్టడం ప్రిన్స్ ఖలేజాకి నిదర్శనం. శాటిలైట్ రైట్స్ 11 కోట్లుకి అమ్ముడవడంతో ప్రొడ్యూసర్ సేఫ్ అనే విన్పిస్తుంది.

Mahesh Bhramotsavam was released and its got mixed talk. But it collections are giving satisfaction to producers. In First day collections it reaches fourth place. So that is Mahesh Babu.