ఇదేనా కేసీఆర్ పాలన

31 May 2016


ఓ అభాగ్యురాలు తనని కాపాడమంటూ లెటర్ రాసినా, ఐజీ స్పందించలేదు, కలెక్టర్ స్పందించలేదు, సీఎం కూడా స్పందించలేదు, ఇదేనా కేసీఆర్ పాలన తీరు. నల్గొండ జిల్లాలో ఝాన్సీ అనే యువతి చనిపోయిన ఘటనపై ఇవే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయ్. తనని భర్త, తల్లి కూడా వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నారంటూ, ఓ యువతి లేఖ రాస్తే ఎందుకు పట్టించుకోలేదు, పైగా ఇలాంటి కేసుల్లో న్యాయం చేస్తే, మీకే పేరొచ్చేది కదా..!

ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయ్, పట్టించుకునే తీరిక లేదంటే ఆ విషయం వేరు, కానీ ఇక్కడ జరిగింది వేరు. సభ్యసమాజంలో మనిషి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాడో తెలియజెప్పే సంగతి ఇది, కన్నతల్లి కసాయిగా మారిన సందర్భంలో ఇక ఎవరికి మొరపెట్టుకోవాలి, అందుకే ఆ అభాగ్యురాలు తనకి తోచిన విధంగా పాలనాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఐనా, పట్టించుకోకపోవడంతో తనువు చాలించింది.

కానీ ఆ అమ్మాయి చనిపోయిన సంగతి కూడా తెలియకుండా జరిగిందంటే ఏమనుకోవాలి. ఇంత నిర్లక్ష్యంగా పోలీస్ సిబ్బంది, పాలనాయంత్రాంగం నిద్రపోతుందా నల్గొండ జిల్లాలో..! బైటపెడిన కేసు ఇదొక్కటి, మరి ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయో, మీ రాజకీయాలు పక్కనబెట్టండి కాస్త అందుకే కళ్లు తెరవండి సార్లూ..!

Nalgonda district Jhansi case is best example for KCR government how it is working. A girl wrote a letter to government, her mother and husband forcing her to do prostitution. But no one is responded to it. So she committed suicide.