దారుణం

3 May 2016


ఈ పదం కంటే మరోటి కన్పించలేదు, విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పసికందు మృతిని ఎలా వర్ణించాలో తెలియదు. చీమలు కుట్టి పాప చనిపోయిందంటున్నారు, అసలు లోకంలోకి వచ్చి నాలుగు రోజులు కాకముందే తనని తాను ఎలా కాపాడుకోగలదో ఎలా తెలుస్తుంది. సిగ్గుమాలిన ప్రభుత్వాలు, వారి అధికారులు నిద్రపోతూ ఉంటే పసిపాపల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయ్. దిక్కుమాలినోళ్లు పాలనలో ఉంటే కుక్కలు కరిచిచంపుతాయ్, దోమలు కుడితే చస్తారు, ఎలుకలూ తమ ప్రాణాలు తీస్తాయ్. ఇప్పుడు వంతు చీమలకు వచ్చింది. చిన్న పాప ఆస్పత్రిలో చీమలు కుట్టి చంపడమేంటి, మరీ ఇంత నిర్లక్ష్యమా దీనిపై ఎలా స్పందించాలి. ఆ ఆస్పత్రి సూపర్నెంట్, నర్స్, వార్డ్ బోయ్ వీల్లని తీసేస్తే చాలా మరి వాళ్లలోని నిర్లక్ష్యాన్ని అలసత్వాన్ని ఎలా తీసేయాలి.

అసలు ప్రభుత్వ ఉద్యోగాలంటే అంత చులకనేంటి, ఎలా పని చేసినా నెల తిరిగేసరికి జీతం పడుతుంటే, ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ రివర్స్ లో నిర్లక్ష్యంగా బతుకున్నారంటే వాళ్లకా ధీమా ఎక్కడ్నుంచి వచ్చింది. ఏం చేసినా చెల్లిపోతుందనే ధైర్యం ఎవరిచ్చారు. డబ్బులిస్తే ఏ పనైనా జరిగిపోతుందనే ధీమానే కదా. నాలుగు రోజులు హడావుడి తర్వాత ఏం చేయరనే భరోసానే కదా..! మరి చంద్రబాబూ, మంత్రి కామినేనీ దీనికి ఏం సమాధానం చెప్తారు. సిగ్గుంటే రాజీనామాలు చేయాలి. ఔను బాధ్యత లేకపోతే, దానికి శిక్ష ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ఆ పనే చేయాలి.

This incindent is the best example for how TDP government is ruling. In Vijayawada Government General Hospital a four days baby was died of ants bite.