మోడీ సంబరాలు దేనికి..?

28 May 2016


రెండేళ్ల పాలన పూర్తైందని బిజెపి నేతలు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు పొదుపు, నీటి పొదుపు, ఆర్ధిక పొదుపు ఇలాంటి మంత్రాలు ప్రకటించేసే కేంద్రం అడ్వర్టైజ్ మెంట్లకే వెయ్యి కోట్లు ఖర్చు పెడుతోందట, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇవే ఆరోపణలు చేశారు. వెయ్యి కోట్లు అంటే మాటలా ఓ రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతాయ్. కోటిరూపాయలకు వందమంది రైతుల జీవితాలు బాగుపడితే, మరి వెయ్యి కోట్లకి ఎంతమంది బాగుపడతారు, ఎన్ని గ్రామాల్లో మంచినీటి సమస్య తీర్చవచ్చు..?

కనీసం వెయ్యి గ్రామాల దశ దిశను మార్చేసేంత ఖర్చు ప్రభుత్వ రెండేళ్ల ఉత్సవాలకోసం అన్యాయంగా ఖర్చు పెట్టడం నిజంగా కరెక్టేనా..? దేశంలో చిన్న, మధ్యతరగతి జనం నానాకష్టాలూ పడి కట్టిన పన్నులతో జల్సా చేయడం కన్నీళ్లు పెట్టించకమానదు. ఇప్పుడు వేసవిలో నీరు దొరక్క మైళ్ల తరబడి నడిచి మురికి నీళ్లు తెచ్చుకుంటున్న వారి బతుకులు బాగు చేయలేరా, ఈ పబ్లిసిటీ లేకపోతే, మహా అయితే మీరు అధికారం కోల్పోవచ్చు, కానీ వెయ్యి గ్రామాల బతుకు మార్చిన తృప్తి చాలదా జీవితానికి.

అసలు జన్ ధన్ యోజన్, స్వఛ్చ భారత్, మేక్ ఇన్ ఇండియా, పహల్ ఈ స్కీములతో సామాన్యుడి బతుకేమైనా మారిందా..? దేశం విడిచి దేశం టిక్ పెట్టుకుని మరీ పర్యటిస్తున్న మోడీ, మీ విదేశాల టూర్లకి అయ్యే ఖర్చు తగ్గించుకోలేరా, ఎందుకింత ప్రచార ఆర్భాటం, మీరు నిజంగా ప్రజాసేవకులలో మొదటివారైతే, ఒకే టూర్ లో అన్ని డ్రస్సులెందుకు మార్చుతున్నారు, దానికి కవరేజ్ వచ్చేలా  ఎందుకు తాపత్రయపడుతున్నారు..?

పైగా మీ అనుంగుమిత్రుడు అమిత్ షా ఎవరు ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పడానికి పార్టీ తరపున ఏమైనా కార్యక్రమాలు చేశారా, రెండంకెల వృధ్ది సాధించారంటున్నారు, మరి టమోటా ఎందుకు కేజీ 60 కి చేరింది, ఉల్లిపాయలెందుకు టన్ను అమ్మినా రైతుకు రూపాయే మిగిలింది. ఇదేనా మీరు రైతాంగానికి సాధించి పెట్టిన అభివృధ్ది, అందుకే అడుగుతున్నారు జనం ఇప్పుడెందుకీ సంబరాలు..? రెండేళ్లైనా పాలనలో ఉండలేరని భయపడ్డారా..?

BJP government celebrating two years of government formation. It spending 100 crores for announcements. Hundred crores is not simple matter.