ఏం చెప్పారు సర్

6 May 2016


ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా విషయంలో ఎన్నిరకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా చేస్తూనే ఉన్నారు. అందమైన అబద్దాలు చెప్పడంలో ఎన్డీఏ పెద్దలకు తెలిసినంతగా కాంగ్రెస్ కి కూడా తెలీదంటున్నారు. అందుకే ఇవాళ సభలో అరుణ్ జైట్లీ ప్రత్యేకహోదా అంశంపై ప్రకటన చేస్తామని చెప్పి కూడా, ఏదోదే చెప్పి కవర్ చేసారు తప్ప విషయం తేల్చలేదు.

విభజనతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని మరోసారి అంగీకరించిన జైట్లీ, రెవెన్యూ లోటునూ పూడ్చామని చెప్పడం దారుణం, విభజన చట్టం ప్రకారం 6,403 కోట్లతో పాటు 2,800 కోట్లు ఇచ్చామని జైట్లీ ఏ లెక్కన చెప్పారో తెలీదు. అలానే  పోలవరానికి నిధులు విడుదల చేశామంటున్న జైట్లీ ఆ ప్రాజెక్టు ఎప్పటికి ఎలా పూర్తవుతుందో నిజంగా తెలిస్తే అలా అనగలరా. అసలు రెవెన్యూ లోటు 13 వేలకోట్లు అని మనం చెప్పిన లెక్కలు పరిశీలిస్తారట, అదెప్పుడు చేయాలి ఇంకో  ఐదేళ్లు పోయిన తర్వాతా, మరీ ఏపీ అంటే అంత చులకనా నీతిఆయోగ్ ఈ లెక్కలు తేల్చుతుందట.

ఇలాంటి మాటలపైనే ఇప్పుడు ఏపీలో జనం మండిపడుతున్నారు. నిజంగా పౌరుషం ఉన్న వాళ్లెవరైనా ఇలాంటి కామెంట్లపై ఎందుకు ఊరుకుంటారు. బాబూ బిజెపి ఏదో ఉద్దరిస్తుందని చెప్పిన వారంతా ఇప్పుడు మళ్లీ నోరు తెరవాలి. అప్పుడే ఈ పుండు మీద కారం జల్లే మాటలు ఆగిపోతాయ్.

Today central minister Arun Jetle announced. We will announced about AP special status. But he did not told any thing about it. He is telling we had paid AP low budget.