చంటి బాబూ స్టేషన్ కి రా

18 May 2016


ఫ్లైట్ లో మహిళతో చీప్ గా బిహేవ్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్రావ్ అలియాస్ చంటికి శ్రీముఖాలు అందాయ్. విజయవాడ పోలీసులు ఆయనకి పోలీస్ స్టేషన్ కి రావాలంటూ సమన్లు జారీ చేశారు. దీంతో ఈ ఇష్యూ ఇంకా రగులుకునే అవకాశమే కన్పిస్తోంది. అధికార పార్టీలో ఉండి పబ్లిక్ ప్లేసుల్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా బిహేవ్ చేయాలనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే అన్ని కళ్లూ అధికారంలో ఉన్నవారిపైనే ఉంటాయ్, అలాంటి స్థితిలో విజయవాడకి చెందిన టిడిపి నేతల వ్యవహారశైలి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. మహిళలపై లైంగికవేధింపులు, కాల్ మనీ కేసులు, మిస్ బిహేవియర్ ఇలాంటి ఆరోపణలతో అధికార పార్టీ టిడిపి పరువు పోయిందని చాలామంది అంటున్నారు. 

ఎందుకంటే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పై నిత్యం ఆరోపణలు గుప్పించే తమ పార్టీ నేతలే ఇలాంటి దిగజారుడుకు పాల్పడటం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. ఇప్పుడు చంటి బాబు ఏ వివరణ అయినా ఇచ్చుకోవచ్చు, కానీ ఈపాటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అతను నేనేం చేయలేదు అంటే నమ్మేవారికన్నా, ఏదో చేసుంటాడనే అంశాన్నే ఎక్కువగా నమ్ముతున్నారు. ఈ దశలో చంటి బాబు నిజంగా అమాయకుడని నిరూపించుకోవడం కొంచెం కష్టమైన పనే.

TDP Leaders are behaving like rowdies. Recently Vijayawada Corporator Venkateswara Rao alias Chanti got arrest warent on misbehaving with lady in flight.