అపూర్వకి వార్నింగ్

25 May 2016


వ్యాంప్ క్యారెక్టర్లు వేసే అపూర్వ గుర్తుంది కదా. మరి సినిమా నటి అనే చీప్ ఫీలింగో (మాకు లేదీ ఫీలింగ్) లేక సింగిల్ గా ఉంటుందని అడ్వాంటేజ్ తీసుకున్నారో కానీ, కొంతమంది ఆమె ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చారు కొంతమంది దుండగులు. యాక్సిడెంట్ చేసిందే కాకుండా నీ దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరించారు. విషయం ఏంటంటే, అపూర్వ సిటీలోని సిధ్దార్ధనగర్ లో ఉంటోంది. మూడ్రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీ వైపు నుంచి వస్తున్న అపూర్వ కారును చౌటుప్పల్ ఏరియా దగ్గరకు రాగానే ఓ కారు ఢీ కొట్టిందట, ఈ ప్రమాదంలో అపూర్వ కారు డిక్కీ మొత్తం డ్యామేజైందట, ఆ ఇన్సిడెంట్ లో షాక్ తిన్న అపూర్వ యాక్సిడెంట్ చేసినోళ్లు కారు రిపేర్ చేయించి, డబ్బులు కూడా ఇస్తామని చెప్పడంతో కాస్త తేరుకుందట.

ఐతే రెండ్రోజుల నుంచి ఆమె పోన్ కి సదరు నిందితులు కాల్స్ చేయడం, ఇంటి చుట్టూ రౌండ్స్ వేయడం ప్రారంభించారట, దీంతో అపూర్వ కి ఠారెత్తిపోయి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో మొత్తం వ్యవహారమంతా కంప్లైంట్ చేసింది. ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు.  మరి దీనివెనుక అసలు కథేంటనేది తెలిసే అవకాశం కన్పిస్తోంది.

Tollywood arties Apuroova got warning from strangers. Recently her car got damage with accident. She was compromise to take money. But now she is getting warning for strangers.