నందమూరితో పూరీ మరోసారీ

2 May 2016


నందమూరి హీరోలతో పూరీ జగన్నాధ్ మరోసారి చేయబోతున్నాడు. ఆంధ్రావాలా తర్వాత టెంపర్ తీసిన పూరీ, రెండు ఎవరి కెరీర్ కి హెల్ప్ కాకపోగా, జనానికి నరకం చూపించాయ్. ఐనా పట్టువదలని విక్రమార్కుడిలా తమ కాంబినేషన్ హిట్టని ప్రూవ్ చేసుకునేందుకు పూరీ నానా తంటాలు పడుతుంటాడు. ఇప్పుడు నందమూరి కల్యాణ్ రామ్ తో ఓ సినిమా ఆనౌన్స్ చేసిన రెండు మూడు నెలలకు ముహూర్తం షాట్ ఓకే చేయించుకున్నాడు పూరీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తీస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ కి హరికృష్ణ, జూనియర్, రామకృష్ణ హాజరయ్యారు. కథ గురించి చెప్తూ, రొమాన్స్ చేయిస్తా కల్యాణ్ రామ్ తో అనడమే హైలెట్. 

ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ ఏం చేస్తే బావుంటుందో వాళ్లకి తెలుసు, కానీ రొమాంటిక్ మూమెంట్స్ వాళ్ల ఫేస్ కి అస్సలు అచ్చిరావ్. ఐనా పూరీ ఇలా అనడం అయ్యో పాపం అన్పించకమానదు. ప్రతి సినిమాకి స్పెయిన్ కి పోయే పూరీ అదే ట్రెండ్ ఈ మూవీకి ఫాలో అవుతాడట. గతంలో కూడా ఇలానే విదేశాలకు తిరిగి ఓం అనే సినిమాతో పాటు, కిక్ కూడా బండ పడేసిన సంగతి కల్యాణ్ రామ్ కి గుర్తుండే ఉంటుంది. ఐనా తనని తాను ఓ స్టార్ గా చూస్కోవాలనే తపన ముందు అవన్నీ దిగదుడుపే మరి.

In the combination of Puri Jaganath and Jr NTR two movies released. But no hit in their account. Now again Puri Jaganath is geeting to movie with Jr NTR.