ఆలీ అనసూయని అలా చేశాడా?

24 May 2016


అనసూయ..ఆలీ అ..ఆ సినిమాలా ఉన్నాయ్ కదా, కానీ ఇప్పుడు వీళ్లిద్దరూ మరో ఇష్యూలో కూడా తాము కలిసే ఒకే పడవలో ప్రయాణిస్తున్నామని తేల్చేశారు. ఆలీ షో చూసినోళ్లు నవ్వుకుంటే నవ్వుకోవచ్చు, బూతులు కాకపోతే ఆయన ఏం స్త్రోత్రాలు చెప్తున్నాడా, కాదు కదా ఐతే ఇది ఒప్పుకోకుండా నాగురించి అలా రాస్తున్నారు, ఇలా రాస్తున్నారు అని ఎందుకు నోరు పారేసుకుంటాడో తెలీదు. జనం మాట్లాడుకోవడం వేరు, అందరి ముందు వెళ్లే ఓ టీవీషోలో మాట్లాడటం వేరు. మనం కాపురం చేస్తున్నాం కదాని, అందరి ముందూ ముద్దూ మురిపెం చేయం కదా(ఈ మధ్య కాలంలో అలా రెచ్చిపోతున్న వాళ్లని బొక్కలో పడేసిన సంగతి చూస్తూనే ఉన్నాం కదా)

నీ ప్రవర్తన సరిగా ఉంటే, ఎవరేం కామెంట్ చేయరు, కావాలని ఇన్ డైరక్ట్ మీనింగ్స్ మాట్లాడి అదే సామాన్య జనం ఫాలో అవుతున్నారు, కాబట్టి మాట్లాడుతున్నాం అనే సమర్ధన వద్దు. సినిమాల్లో లేపుకెళ్లడం అనే ప్రక్రియని కామన్ చేశారు కాబట్టే, ఓ పెద్ద హీరో కూతురు లేచిపోయిన తర్వాత అంత వ్యతిరేకత రాలేదు సరి కదా, సినిమా వాళ్లకి తగిన శాస్తి జరిగిందని అందరూ సంతోషపడ్డారు. ఇ్పపుడు మీరు మాట్లాడే బూతులు ఇంట్లో పిల్లలు కూడా మాట్లాడుకున్న తర్వాత అర్ధమవుతుంది. తోలు మందంగాళ్లకి అది కూడా ఇప్పుడప్పుడే తెలియదు లెండి. టాపిక్ ఏంటంటే.. ఆలీతో జాలీగా షో లో బూర హార్న్ ని మోగిస్తూ, కావాల్సినంత బూతులు మాట్లాడుకోవడం ఆ షోలో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆలీని హాట్ యాంకర్ అనసూయ కూడా ఎంకరేజ్ చేయడమే విచిత్రం. అంటే అలా మాట్లాడితేనే జనం లైక్ చేస్తారనుకోవడం జనాల్ని అవమానించడమే.

ఇంతకీ అనసూయ ఏమన్నదంటే.."నాదెందుకు పిసుకుతున్నావ్.." ఇది ఇన్ డైరక్ట్ డబుల్ మీనింగ్ కాకపోతే, అంత పగలబడి నవ్వాల్సిన అవసరం ఏముంది. అలానే యూట్యూబ్ లో బూతు సంభాషణల్లో ఎక్కువగా విన్పించేది ఇదే, ఈ డైలాగ్ తెలిసి తెలిసీ ఎందుకనాలి అన్న తర్వాత ఎవరూ ఏ కామెంట్ చేయకుండా ఎందుకుంటారు, ఆలీనే ఆన్సర్ చెప్పాలి.

Telugu comedian Ali is always hot topic in media. In TV shows and stage shows, he always talking double meaning dialogues. Now anchor Anasuya is also following him.