అ.ఆ తో భ.బృ

4 May 2016


టైటిల్ చూసి కంగారు పడకండి. అనసూయతో ఆనంద్ విహారి సినిమా ఆడియో విడుదలకు హాజరైనవాళ్లు, అక్కడ డయాస్ పై మాట్లాడిన వాళ్ల ప్రసంగాలు చూస్తే, ఇదే అన్పించకతప్పదు. నేను నిన్ను పొగుడుతా, నువ్ నన్ను పొగుడు ఇది ఏ ఫంక్షన్లోనైనా కామన్. కానీ ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమ ట్రెండ్ చూస్తుంటే, నువ్ ఎవరితోనైనా ఛాన్స్ రావాలంటే వాళ్లని ఆకాశానికెత్తేయ్ అన్నట్లు అసలు తమ ముందున్నది గొర్రెల్లా, తాము పొగుడుతుంది దైవాంశసంభూతుల్లా భావిస్తున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చిత్రదర్శకుడు కావడం తెలుగవారి అదృష్టమట. ఇది పవన్ కల్యాణ్ డైలాగ్, ఫంక్షన్ కి పవన్ కల్యాణ్ వచ్చాడు. ఇక సినిమా హిట్ ఇది సమంత క్లారిఫికేషన్, పవన్ ని కలవడానికి నితన్ వచ్చినప్పుడు ఆయనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయట, అవును మరి ఈయనో కాలజ్ఞాని త్రివిక్రమ్ తో తన పరిచయం ఇప్పటికాదంటూ అదేదో సక్సెస్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నారనే కామెంట్ కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు పవన్ కల్యాణ్. వీళ్ల భజనలు చూస్తుంటే ఎక్కడైనా ఇక ఇదే గోల అన్పించకమానదు. అందుకే అనసూయ వర్సెస్ ఆనంద్ విహారి చుట్టూ చేసిన భజన బృందం అంటున్నారు. రేపు సినిమా విడుదలైన తర్వాత ప్రమోషన్లలో కూడా ఇదే హోరు విన్పిస్తుందేమో అని ఆడియెన్స్ బెంబేలెత్తుతున్నారు.

Recently Nitheen movie Aa..a audio was released. To this function Pavan Kalyan is chief guest. In this audio function all guests are praising others.